Pimple Free Skin: ముఖంలో గ్లో పెరగడానికి, మచ్చల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఫుడ్‌లను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్ లభించే వివిధ రకారల ప్రోడక్ట్‌ను వాడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అయితే వీటి నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యలకు నిమ్మకాయ ప్రభావంతతంగా పని చేస్తుందని.. చర్మ సమస్యలకు వాటిని వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిమ్మకాయను ముఖానికి ఎలా ఉపయోగించాలో.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
<<నిమ్మరసం చర్మంపై మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. కావున దీనిని వారానికి రెండు లేదా మూడు సార్లు వినియోగిస్తే.. మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సన్ టాన్, ముడతలను కూడా తొలగిస్తుంది.
<<జిడ్డు చర్మం ఉన్నవారికి నిమ్మరసం చాలా మేలు చేస్తుంది. ఇందుకోసం వారానికి మూడుసార్లు నిమ్మరసాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో మెరుపు పెరుగుతుంది.
మొటిమలను తొలగిస్తుంది:
మొటిమల సమస్యను తొలగించడానికి నిమ్మరసం ప్రభావవంతంగా కృషి చేస్తుంది. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ముఖంపై వచ్చే మొటిమలు తొలగించడానికి సహాయపడుతుంది.
నిమ్మరసాన్ని ముఖానికి ఎలా అప్లై చేయాలి?:
నిమ్మరసాన్ని నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల పలు రకాల దుష్ర్పభావాలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల ఎల్లప్పుడూ నిమ్మరసంలో కొన్ని పదార్థాలను కలిపిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. అయితే నిమ్మరసంలో.. చెంచా అలోవెరా జెల్ మిక్స్ చేసి చర్మంపై అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook