Piles Cure In 3 Days: ప్రపంచ వ్యాప్తంగా పైల్స్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీని కారణంగా చాలా మందిలో పురీషనాళం కింది భాగంలో కూడా వాపు సమస్యలు వస్తున్నాయి. దీనిని వైద్య భాషలో దీనిని హెమోరాయిడ్స్ అంటారు. దీని కారణంగా మలద్వారం లోపల, వెలుపల వాపు సమస్యలు కూడా వస్తాయి. ప్రస్తుతం చాలా మందిలో రెండు రకాల పైల్స్ వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒకటి బ్లడీ పైల్స్ అయితే రెండవది డెడ్ పైల్స్. ఈ సమస్యలు 45 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే వస్తుండేవి..కానీ ఆధునిక జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
పైల్స్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని గుర్తుంచుకోండి:
❀ పైల్స్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నూనె అతిగా ఉండే ఆహారాలు కూడా తినడం మానుకోవాలి.
❀ పైల్స్ సమస్యలు ఉన్నవారు తప్పకుండా బీన్స్, చిక్పీస్, కాయధాన్యాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అతిగా పప్పులతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం కూడా మానుకోవాల్సి ఉంటుంది.
❀ ఈ వ్యాధితో బాధపడేవారు ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. దీంతో పాటు నీటిని కూడా అధికంగా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పైల్స్ సమస్య వస్తే ఏం చేయాలో తెలుసా?:
❀ పైల్స్ సమస్యలు ఉన్నవారు తప్పకుండా నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
❀ దీంతో పాటు ఫైబర్ అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఫైబర్ కలిగిన ఆహారాలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండామ ఇందులో ఉండే గుణాలే పైల్స్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
❀ ప్రతి రోజు తప్పకుండా తేలికైరన, వదులు దుస్తువులను మాత్రమే ధరించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook