/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Pigmentation Home Remedies: వయస్సు పెరిగే కొద్దీ స్త్రీలలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది స్త్రీలలో ముఖంపై మచ్చలు, నల్లగా చర్మం ఏర్పడడం వంటి తీవ్ర చర్మ సమస్యలు వస్తాయి. ఇంకొందరులోనైతే చర్మంలో మెలనిన్ పెరగడం వల్ల మచ్చలు ఏర్పడతాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలా రకాల చిట్కాలు కూడా ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల కూడా సులభంగా చర్మంపై నల్ల మచ్చల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నల్ల మచ్చల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మచ్చలను తొలగించే ఆయుర్వేద నివారణలు ఇవే:

టమాటో రసం:
టమాటో లో ఉండే గుణాలు చర్మం లో పేరుకుపోయిన మెలనిన్ ఉత్పత్తిని సులభంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా టమాటో జ్యూస్ ని ముఖానికి అప్లై చేయవలసి ఉంటుంది. ఇలా అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల ఉంచితే మీరు త్వరలోనే ఫలితం పొందుతారు.

పసుపు:
పిగ్మెంటేషన్ లేదా డార్క్ స్పాట్స్, సూర్యరశ్మి కారణంగా టాన్డ్ స్కిన్ ఉన్నవారు తప్పకుండా వారి స్కిన్ కి పసుపుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వినియోగించాల్సిన ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి సులభంగా చర్మ సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు కూడా సహాయపడతాయి.

బంగాళదుంప:
చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి బంగాళదుంప రసం కూడా చాలా ప్రభావం పనిచేస్తుంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా దీనికోసం బంగాళదుంప రసాన్ని తీసుకొని అందులో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి ముఖానికి పట్టించి పది నిమిషాల పాటు అలానే వదిలేసి శుభ్రం చేసుకుంటే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

కలబంద జెల్ :
అలోవెరా జెల్‌ని ముఖానికి వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో అందరికీ తెలిసింది. ఇందులో చర్మానికి సంబంధించిన అన్ని రకాల పోషకాలు విచ్చలవిడిగా లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు దీనిని చర్మానికి అప్లై చేస్తే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ముఖం పై ఉన్న జిడ్డు మొత్తం సులభంగా తొలగిపోతుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా అలోవెరా జెల్‌ని ఉపయోగించండి.

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Section: 
English Title: 
Pigmentation Home Remedies: If You Drink Turmeric And Tomato Juice Every Day Pigmentation Will Reduce In 10 Days
News Source: 
Home Title: 

Pigmentation Home Remedies: చర్మంపై ఎలాంటి మచ్చలైనా నయా పైసా ఖర్చులేకుండా ఇలా మటు మాయం..

Pigmentation Home Remedies: చర్మంపై ఎలాంటి మచ్చలైనా నయా పైసా ఖర్చులేకుండా ఇలా మటు మాయం..
Caption: 
Source: ZEE TELUGU NEWS
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
చర్మంపై ఎలాంటి మచ్చలైనా నయా పైసా ఖర్చులేకుండా ఇలా మటు మాయం..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, January 8, 2023 - 17:29
Request Count: 
57
Is Breaking News: 
No