Pear fruit Benefits: పీయర్‌ పండు తింటే ఈ ఆరోగ్య సమస్యలు మీ దరిదాపుల్లోకి రావు..

Pear fruit Benefits: పీయర్‌ఫ్రూట్ తీపిగా ఉండటమే కాకుండా ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి .ముఖ్యంగా ఇందులో  ఫైబర్ ఉంటుంది. పియర్స్ మన ఆరోగ్యకరమైన బరువు నిర్వాహన కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 14, 2024, 01:41 PM IST
Pear fruit Benefits: పీయర్‌ పండు తింటే ఈ ఆరోగ్య సమస్యలు మీ దరిదాపుల్లోకి రావు..

Pear fruit Benefits: పీయర్‌ఫ్రూట్ తీపిగా ఉండటమే కాకుండా ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి .ముఖ్యంగా ఇందులో  ఫైబర్ ఉంటుంది. పియర్స్ మన ఆరోగ్యకరమైన బరువు నిర్వాహన కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పీయర్‌ ఫ్రూట్లో విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది. ఇది స్కిన్ ,ఇమ్యూనిటీ వ్యవస్థకు ఎంతో అవసరం . దీన్ని ఈవినింగ్‌ స్నాక్‌ మాదిరి తీసుకుంటే ఎంతో ఆరోగ్యకరం. ఈరోజు పీయర్ పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

పియర్ ఫ్రూట్ ని మంచి స్నాక్‌ ఐటంలా తీసుకోవచ్చు. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో సహజసిద్దమైన చక్కెరలు ఉంటాయి. అంతేకాదు ఇవి సహజ సిద్ధంగా శరీరానికి బూస్ట్ ను అందిస్తుంది. ఎక్కువ ఆకలి వేయకుండా చేస్తుంది.

క్యాన్సర్..
 పీయర్‌ పండులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల ఇది క్యాన్సర్ కణాలు పెరగకుండా నివారిస్తుంది అని ఎన్ హెచ్ నివేదిక తెలిపింది. క్యాన్సర్‌ కణాలు కూడా పెరగకుండా కాపాడుతుంది. కేన్సర్‌ను సమర్థవంతంగా నివారిస్తుంది.

ఆస్టియోపోరోసిస్..
బోన్ డిజార్డర్‌ సమస్యలతో బాధపడుతున్నవారు పియర్ ఫ్రూట్ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఇందులోని కాల్షియం ఆస్టియోపోరోసిస్ వ్యాధి నుంచి నివారిస్తుంది. ఆరోగ్యకరమైన ఎముకలకు తోడ్పడుతుంది. డైట్ లో చేర్చుకోవడం వల్ల బోరోన్ పుష్కలంగా మన శరీరానికి అందుతుంది. క్యాల్షియంని గ్రహిస్తుంది పీహెచ్ స్థాయిలను నిర్వహిస్తుంది

ఇదీ చదవండి: ఉల్లిపాయరసం జుట్టుకు ఇలా పట్టిస్తే కుదుళ్ల నుంచి బలంగా.. నడుము వరకు పెరుగుతుంది..

షుగర్ కంట్రోల్..
ఇందులో ఉండే అంథోసైనీన్‌ టైప్ 2 డయాబెటిస్ వారికి మంచిది. ఇందులో గ్లైసిమిక్స్ సూచి తక్కువగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తీపి తినాలని కోరిక తగ్గుతుంది. షుగర్‌ లెవెల్ నివారిస్తుంది, డయాబెటిస్ వాళ్ళు ఆరోగ్యకరమైన షుగర్ లెవల్స్‌ నిర్వహిస్తూ పీయర్‌ పండును తినవచ్చు.

మంటను తగ్గిస్తుంది..
 పీయర్‌ పండు డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులోనే పాతోజీన్స్ మంట సమస్యను తగ్గిస్తుంది. ప్రాణాంతక వ్యాధులనుంచి కాపాడుతూ నివారిస్తుంది. ఆల్జీమార్ క్యాన్సర్ టైప్ టు డయాబెటిస్ వారికి ఇది మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది.

ఇదీ చదవండి: గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఈ 6 ఆహారాలు మీ డైట్ లో ఉంటే బరువు పెరిగే ఛాన్స్ లేదు..

ప్రెగ్నెన్సీ..
 పీయర్‌ పండులో పోలిక్ యాసిడ్ ఉంటుంది ఇది ప్రెగ్నెన్సీ మహిళలకు ఎంతో మంచిది అబార్షన్స్ కాకుండా నివారిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News