Winter Healthy Foods: చలికాలంలో వీటిని తింటే మీ రోగనిరోధక శక్తి డబుల్ ..!

Immunity Boosting Foods: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో తరుచు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. రోగనిరోధకశక్తిని పెంచే కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి అవి ఎంటో మనం తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Nov 20, 2024, 11:58 AM IST
Winter Healthy Foods: చలికాలంలో వీటిని తింటే మీ రోగనిరోధక శక్తి డబుల్ ..!

Immunity Boosting Foods: చలికాలంలో వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చలికాలంలో ఏ ఆహారాలు తీసుకోవాలి? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం ఇక్కడ చెప్పిన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు. 

చలికాలంలో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో తరుచు బాధపడుతుంటారు. దీనికి కారణం రోగనిరోధకశక్తి దెబ్బతినటం. రోగనిరోధక శక్తి శరీరంలో తగ్గినప్పుడు ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. కాబట్టి చలికాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మంచిది అనేది తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలు ఇవే:

సాధారణంగా విటమిన్‌ సి ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తిని పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు ఇవి ఎక్కువగా నారింజ, నిమ్మ, మందారిన వంటి సిట్రస్ పండ్లు లో పుష్కలంగా లభిస్తుంది. కేవలం పండ్లు మాత్రమే కాకుండా ఆకుకూరలతో కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అందులో  పాలకూర, బ్రోకలీ, కాలే వంటి ఆకుకూరలు మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఆహారంలో డ్రై ఫూట్స్‌లను కూడా తీసుకోవచ్చు. అందులోను ముఖ్యంగా  బాదం, జీడిపప్పు, వాల్నట్స్ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో్ విటమిన్ ఈ, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  బ్రౌన్ రైస్, ఓట్స్, రాగులు వంటి ధాన్యాలు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మూగపప్పు, కందిపప్పు, చిక్కుడు దుంప వంటి పప్పులు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా తయారు చేయడమే కాకుండా  రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దాడిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

అదనంగా:

శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. ప్రతిరోజు వ్యాయామం రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సరిపడా నిద్ర తీసుకోండి: నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించండి.

ఇదీ చదవండి: ఇజ్రాయేల్‌ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్‌.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News