New Year 2023: న్యూ ఇయర్ వేడుకలు కొత్త ప్రదేశంలో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో టాప్ 5 ప్లేసెస్ ఇవే..

New year 2023 : న్యూఇయర్ రావడానికి ఇంకెన్నో రోజులు లేదు. మరి  2023 కొత్త సంవత్సర వేడుకలను మీ ప్రాంతంలో కాకుండా వేరే ప్లేస్ లో చేసుకోవాలనుకుంటున్నారా... అయితే ఏ ప్రదేశానికి వెళ్తే బాగుంటుందని సెర్చ్ చేస్తున్నారా. అయితే ఇది మీ కోసమే. మన దేశంలోని టాప్-5 ప్రదేశాలు ఇవే.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 07:52 AM IST
  • కొత్త సంవత్సరం వచ్చేస్తోంది
  • ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా
  • అయితే ఇండియాలో బెస్ట్ ప్రదేశాలు ఇవే
New Year 2023: న్యూ ఇయర్ వేడుకలు కొత్త ప్రదేశంలో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో టాప్ 5 ప్లేసెస్ ఇవే..

BEST PLACES TO VISIT AT NEW YEAR 2023 IN INDIA: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. 2022కి గుడ్ బై చెప్పి 2023కి (New year 2023) స్వాగతం పలికేందుకు కౌంట్‌డౌన్ మెుదలైంది. అయితే డిసెంబరు 31, నూతన సంవత్సరం వేడుకలు  కొత్త ప్రదేశంలో జరుపుకునేవారికి ఇండియాలో టాప్ బెస్ట్-5 ప్లేసెస్ ఇవే.

1.గోవా..
భారతలో న్యూ ఇయర్ వేడకలకు గోవా చాలా మంచి ఎంపిక. ఎందుకంటే ఇక్కడ బీచ్ కల్చర్ మనల్ని కట్టిపడేస్తోంది. తక్కువ ధరకే లిక్కర్ దొరుకుతుంది. పబ్ కల్చర్, లైవ్ మ్యూజిక్, నైట్ లాంగ్ పార్టీస్ గోవాలో అదిరిపోతాయి. 

2. మనాలి, హిమాచల్ ప్రదేశ్
ఈ ప్రాంతం ఏడాది పొడవునా పర్యాటకులతో కిక్కిరిసి ఉంటుంది. ఇక్కడ మాల్ రోడ్ లో షాపింగ్ చేయడం ఓ అందమైన అనుభూతి. ఇక్కడి హిప్పీ సంస్కృతి మిమ్మల్ని కట్టిపడేస్తుంది. '‘వాలీ ఆఫ్ ది గాడ్స్' గా పిలువబడే ఈ ప్లేస్ న్యూఇయర్ వేడుకలు బెస్ట్ చాయిస్. 

3. గుల్మార్గ్, జమ్మూకాశ్మీర్
ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునేవారికి జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ బెస్ట్ చాయిస్. మంచును అస్వాదించాలనుకునేవారు కొత్త సంవత్సర వేడుకలు ఇక్కడ చేసుకోవడం మంచిది. 

4. ఊటీ, తమిళనాడు
సౌత్ ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లలో ఊటీ ఒకటి. ఇక్కడి ట్రాయ్ ట్రైన్ జర్నీ మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. చాలా కూల్ గా ఉండే ప్రదేశాల్లో ఇది ఒకటి. అందుకే నూతన సంవత్సర వేడుకలు ఇక్కడ చేసుకోవడానికి ఫ్లాన్ చేసుకోండి. 

5. వాయనాడ్, కేరళ
ఇండియాలో గ్రీన్ ప్యారడైజ్ గా పిలువబడే ప్రాంతం కేరళలోని వాయనాడ్. ఇక్కడి కాఫీ తోటలు, అందమైన ప్రకృతికి మీరు ఫిదా అవుతారు. ఇది ఆయుర్వేద చికిత్సకు ప్రసిద్ధ ప్రాంతం. ఇక్కడి జలపాతాలు మిమ్మిల్నిని అబ్బురుపరుస్తాయి. ఇకెందుకు ఆలస్యం బ్యాగ్ సర్దుకుని న్యూఇయర్ చేసుకోవడానికి చెక్కేయండి మరి.

Also Read: Rarest Blood Group: ప్రపంచంలో 45 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్.. బంగారం కంటే ధర ఎక్కువే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News