Nellore Pappu Charu Recipe: నెల్లూరు స్టైల్ పప్పు చారు రుచే వేరు..ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది!

Nellore Pappu Charu Recipe: నెల్లూరు స్టైల్ లో పప్పుచారు అంటే అందరికీ ఎంతో ఇష్టం..అందులో ఆవకాయ కలుపుకొని తింటే నూటికి మరింతో రుచి. మీరు కూడా ఈ నెల్లూరు స్టైల్ పప్పు చారుని చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా సులభంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2023, 09:45 PM IST
Nellore Pappu Charu Recipe: నెల్లూరు స్టైల్ పప్పు చారు రుచే వేరు..ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది!

 

Nellore Pappu Charu Recipe: కొన్ని ఆంధ్ర వంటకాల టేస్టే వేరు..ముఖ్యంగా నెల్లూరు ప్రాంతంలోని లభించే చేపల కూర, పప్పుచారు కానీ చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు. అందుకే ఆ వంటకాలకు ఊర్ల పేర్ల పెట్టి పిలుస్తూ ఉంటారు. పిల్లలనుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా పప్పుచారుతో తృప్తిగా భోంచేస్తారు. పప్పు చారు ఒకటైన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్‌లో చేసుకోవడం భారతీయుల ప్రత్యేకత. కానీ ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరు పప్పుచారుకి ప్రత్యేకత ఉంది. దీని రుచి ఏ నాన్ వెజ్ వంటకాల రుచి పై కూడా పనికిరాదట. మీరు కూడా ఓసారి టెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ నెల్లూరు పప్పుచారు తయారీ విధానం, ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నెల్లూరు పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు:

  1. ఒక చిన్న గ్లాసు కందిపప్పు
  2. ఒకరెమ్మ కరివేపాకు
  3. తగినంత ఉప్పు
  4. రెండు తరిగిన టమాటో ముక్కలు
  5. తగినంత ఎండుమిర్చి
  6. ఒక టీ స్పూన్ పసుపు
  7. తగినన్ని నీళ్లు
  8. పప్పు చారుకు సరిపడ నూనె
  9. ఒక చిన్న కప్పు తరిగిన ఉల్లిపాయలు
  10. నిమ్మకాయ అంత చింతపండు
  11. రెండు రెబ్బల వెల్లుల్లి

తయారీ విధానం:
ముందుగా పప్పును బాగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్లో వేసి రెండు గ్లాసుల నీటిని పోసుకొని అందులోనే టమాటో ముక్కలు ఎండుమిర్చి పసుపు నూనె వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికిన పప్పులోనే చింతపండు రసం ఉప్పు తగినన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పప్పును పక్కన పెట్టుకొని మరో చిన్న గిన్నెలో నూనెను వేసుకొని అందులోనే తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు  వేసి బాగా పోపును కలుపుకోవాలి. ఆ తర్వాత పోపును పప్పులో పోసుకొని ఓ ఐదు నిమిషాల పాటు స్టవ్ పై పెట్టి పప్పును మరిగించాలి. ఇలా ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత అదే పప్పులో కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవాలి.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

పప్పు చారు వల్ల కలిగే లాభాలు:
పప్పులు శరీరానికి కావలసిన పోషకాలతో పాటు ఫైబర్ కూడా లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పిల్లలకు పప్పుచారును ఆహారంగా ఇవ్వడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా పోషకాల లోపం నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అందరూ తప్పకుండా వారంలో ఒక రోజైనా పప్పుచారును ఆహారంగా తీసుకోవాలి.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News