Natural Remedies For Constipation: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో ఉత్పన్నమవుతున్న సమస్యలల్లో మలబద్ధకం ఒకటి. ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే మలబద్ధకం సమస్య ఉన్నవారిలో చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చు. ఆకలి లేకపోవడం, త్రేనుపు, ఛాతీలో మంట, కడుపులో నొప్పి మొదలైనవి ఇబ్బందు ఈ సమస్యల వల్ల వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది.
వీటితో సులభంగా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు:
1. ఆకు కూరలు:
ఆహారంలో ఆకు కూరలను వినియోగించడం వల్ల శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి మలబద్ధకం సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అయితే ప్రతి రోజూ ఆహారంలో బ్రోకలీ, బచ్చలికూరను తీసుకోవాల్సి ఉంటుంది.
2. పెరుగు:
పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి పెరుగు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరుగులో ఉండే Bifidobacterium lactis అనే ప్రోబయోటిక్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఆహారంలో పెరుగును తీసుకోవాల్సి ఉంటుంది.
3. ఆమ్లా ఫుడ్స్:
ఆమ్లా కలిగి ఉన్న ఆహారాలను సూపర్ ఫుడ్స్‌గా భావిస్తారు. అయితే ఇది శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 2 టీస్పూన్ల ఉసిరి రసాన్ని నీటిలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.
4. నెయ్యి:
నెయ్యిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతారని భావిస్తారు. కానీ ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ కూడా లభిస్తుంది. కాబట్టి సులభంగా పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్
Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్.. యాంకర్ జబర్దస్త్ రిప్లై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Constipation Home Remedies: పొట్ట సమస్యలతో పాటు మలబద్ధకం సమస్యలకు 2 రోజుల్లో చెక్.!