Muscle Building Tips: జిమ్‌కు పోకుండానే బలమైన కండరాలను పొందాలనుకుంటున్నారా.. ఇవి తినండి..!

Muscle Building Tips: బలమైన కండరాలను పొందాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వీటిని అందరూ  పొందలేరు. అయితే శరీరం దృఢంగా పొందడానికి, బలమైన కండరాలు పొందడానికి భారీ వ్యాయామాలు అవసరం.

Last Updated : Jul 8, 2022, 03:00 PM IST
  • జిమ్‌కు పోకుండానే బలమైన కండరాల కోసం..
  • ఆపిల్ పండ్లను తినండి
  • శరీరాన్ని దృఢంగా చేస్తుంది
Muscle Building Tips: జిమ్‌కు పోకుండానే బలమైన కండరాలను పొందాలనుకుంటున్నారా.. ఇవి తినండి..!

Muscle Building Tips: బలమైన కండరాలను పొందాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వీటిని అందరూ  పొందలేరు. అయితే శరీరం దృఢంగా పొందడానికి, బలమైన కండరాలు పొందడానికి భారీ వ్యాయామాలు అవసరం. అయితే వ్యాయమం చేసే క్రమంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా.. జిమ్‌లో చెమట వ్యాయమం చేయకుండా బలమైన కండరాలను పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం మార్కెట్‌లో లభించే పలు రకాల పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బలమైన కండరాల కోసం ఈ పండ్లను తినండి:

1. ఆపిల్:

ప్రతి రోజూ ఒక యాపిల్‌ పండును తింటే శరీరంలో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతుంటూ ఉంటారు. అయితే ఇందులో ఉండే గుణాలు శరీర అభివృద్ధికి దోహదపడమే కాకుండా కండరాలను బలపరుస్తుంది.

2. పుచ్చకాయ:

ఎండాకాలంలో పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ పుచ్చకాయ తినడం వల్ల సిరలు, కండరాలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

3. ద్రాక్ష:

భారతదేశ ప్రజలు ద్రాక్షను చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేయడంతోపాటు.. కండరాల అభివృద్ధికి కూడా సహకరిస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో ద్రాక్షను తినడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

4. డ్రాగన్ ఫ్రూట్:

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫినాలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. భారతదేశంలో దీనిని 'కమలం పండు' అని కూడా అంటారు. ఈ పండు ఖరీదయినదే అయినప్పటికీ రెగ్యులర్ గా తింటే కండరాలు దృఢంగా తయారవుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Boris Johnson: అక్కడ డొనాల్ట్ ట్రంప్.. ఇక్కడ బోరిస్ జాన్సన్! పిచ్చి పనులే కొంప ముంచాయా?

Also Read: Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News