White Hair To Black Hair: వాతావరణ కాలుష్యం కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యమైన ఆహారాలతో పాటు ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండటం చాలా మంచిది. 50% మందిలో తెల్ల జుట్టు సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
ఆకు కూరలు క్రమం తప్పకుండా తినడం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఆకుకూరల్లో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఎలాంటి జుట్టు సమస్యల నుంచైనా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే
ప్రస్తుతం చాలామంది తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన హెన్నా ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు వీటిని వినియోగించడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని వినియోగించకుండా సహజంగా లభించే హెన్నను వినియోగించడం చాలా మంచిది.
గోరింటాకు కూడా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి గోరింటాకు మిశ్రమాన్ని తెల్ల జుట్టుకు అప్లై చేసి మిశ్రమం ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
కుంకుడుకాయ మిశ్రమం కూడా తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా కుంకుడుకాయ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది.
ఉసిరికాయ పొడి కూడా తెల్ల జుట్టు సమస్యలు రాకుండా దోహదపడుతుంది. ఇందులో జుట్టుకు సంబంధించిన చాలా రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పొడిని కొబ్బరి నూనెలో కలుపుకొని మిశ్రమంలా తయారుచేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
White Hair: తెల్ల జుట్టుతో బాధపడే వారందరికీ గుడ్ న్యూస్.. సులభంగా వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ గా మారడం ఖాయం!