Marwadi Style Sweet Lassi Recipe: వేసవికాలంలో అనేక మందిలో డిహైడ్రేషన్ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్య కారణంగా అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే డీహైడ్రేషన్ బారిన పడకుండా శరీరాన్ని కావలసిన కొన్ని డ్రింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ డిహైడ్రేషన్ సమస్య అనేది ఎండల్లో ఎక్కువగా తిరిగే వారిలో వస్తుంది. వేసవికాలంలో ప్రతిరోజు ఎండలో తిరిగేవారు తప్పకుండా స్వీట్ లస్సీ లేదా నిమ్మరసం తాగడం వల్ల దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచుగా డిహైడ్రేషన్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా స్వీట్ లస్సిని తీసుకోవడం ఎంతో మంచిది ఇందులో శరీరాన్ని కావాల్సిన కొన్ని పోషకాలతో పాటు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఎండల్లో తిరిగేవారు స్వీట్ లస్సీ తీసుకోవడం ఎంతో మంచిది. అయితే ప్రస్తుతం చాలామంది షాపుల్లో లభించే స్వీట్ లస్సీ ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనికి బదులుగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి లభిస్తుంది. అయితే ఈ లస్సీని ఎలా సులభంగా తయాలో చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ లస్సీ రెసిపీకి కావలసిన పదార్థాలు:
1 కప్పు పెరుగు
1/2 పాలు కప్పు
2 టేబుల్ స్పూన్ల చక్కెర
1/4 టీస్పూన్ యాలకుల పొడి
1/4 టీస్పూన్ జీలకర్ర పొడి
కొన్ని ఐస్ క్యూబ్స్
తయారీ విధానం:
ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది అందులో పెరుగు, పాలు, చక్కెర, యాలకుల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
ఇలా అన్నింటినీ గిన్నెలో వేసుకున్న తర్వాత బాగా చిలికాల్సి ఉంటుంది. చిలుకుతూ మధ్య మధ్యలో షుగర్ వేసుకోవాలి.
ఆ తర్వాత ఇలా చిలికిన లస్సీలో ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీలో బ్లెండ్ చేయాలి. అంతే సులభంగా స్వీట్ లస్సీ తయారైనట్లే..
చిట్కాలు:
లస్సి మరింత రుచిగా తయారు చేసుకోవడానికి అందులో అరటి పండ్లు మామిడి పండ్లు స్ట్రాబెరీ లను కూడా యాడ్ చేయవచ్చు.
ఈ స్వీట్ లస్సీ ని తయారు చేసుకునే గ్రామంలో చక్కెరకు బదులుగా తేనే లేదా ఖర్జూరాలను వినియోగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అంతేకాకుండా ఇందులో కావాలనుకుంటే బాదంపప్పు లేదా పిస్తా పప్పును వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు.
పెరుగు అంటే ఇష్టపడని వారు పాలను అధికంగా వినియోగించవచ్చు.
స్వీట్ లస్సీ ప్రయోజనాలు:
స్వీట్ లస్సీని వేసవి కాలంలో ప్రతిరోజు తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది అంతేకాకుండా డిహైడ్రేషన్ బారిన పడకుండా కూడా రక్షణ కలుగుతుంది.
ఈ స్వీట్ లస్సీలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.
ముఖ్యంగా అలసట సమస్యలతో బాధపడేవారు దీనిని ప్రతి రోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Marwadi Style Sweet Lassi Recipe: మార్వాడి స్టైల్‌లో స్వీట్ లస్సీ రెసిపీ.. ప్రతిరోజు తాగితే డిహైడ్రేషన్ సమస్యకు చెక్..