Disadvantages of coconut water: కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఈ నీరు ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. శరీరాన్ని డీహైడ్రేట్ గా ఉంచడంలో కొబ్బరి నీరు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కొకోనాట్ వాటర్ లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లు ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. కొబ్బరి కాయను కొట్టిన వెంటనే తాగేయాలి, లేకపోతే అది పోషకాలను కోల్పోతుంది. కొబ్బరి నీళ్లను అతిగా తాగితే శరీరానికి హాని కలిగే అవకాశం ఉంది. ఈ కొకోనట్ వాటర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
** కొబ్బరి నీళ్లలో ఎక్కువ మెుత్తంలో పోటాషియం ఉంటుంది. కాబట్టి క్రీడాకారులు కొబ్బరి నీరు కంటే మామూలు వాటర్ తాగడం మంచిది.
** అలెర్జీ ఉన్నవారు లేదా తరుచూ ఇన్ఫెక్షన్ల బారిన పడే వారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది కాదు. దీనిని తీసుకోవడం వల్ల మీ వ్యాధి మరింత పెరుగుతుంది.
** కొకోనట్ వాటర్ లో కార్బోహైడ్రేట్లు మరియు కేలరీలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిక్ రోగులు దీనిని తాగకపోవడమే మేలు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, కంట్రోల్ చేయదు.
** కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగడం జీర్ణవ్యవస్థకు మంచిది కాదు. ప్రేగు సమస్యలు ఉన్నవారు అయితే దీని జోలికి పోకూడదు.
** కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. ఈ నీరు తాగడం వల్ల మీరు హైపర్‌కలేమియా బారిన పడే అవకాశం ఉంది. మీరు బలహీనంగా ఉండటం, స్పృహ కోల్పోవడం మరియు తలనొప్పి రావడం జరుగుతుంది.
Also Read: Karonda Fruit Benefits: వాక్కాయలతో మధుమేహంతో పాటు ఈ దీర్ఘకాలిక వ్యాధులకు చెక్..
** కొబ్బరి నీరు మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని అతిగా తాగడం వల్ల మీరు చాలా సార్లు బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.
** చల్లటి వాతావరణంలో నివసించే వ్యక్తులు కొబ్బరి నీళ్లు తీసుకోకపోవడమే నయం. ఎందుకంటే ఇది మీ బాడీని మరింత చల్లబరుస్తుంది. అంతేకాకుండా మీరు తరుచు జలుబుతో బాధపడే అవకాశం ఉంది.
** ఈ వాటర్ ను తీసుకోవడం వల్ల మీ బీపీ డౌన్ అవుతుంది. దీని వల్ల బాధితుడి ప్రాణం ప్రమాదంలో పడుతుంది.కాబట్టి ఈ సమయంలో మీరు మీ డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.
** ఈ సహజమైన వాటర్ ను అధిక పరిణమాణంలో తీసుకోవడం వల్ల మీకు విరేచనాలు, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
Also Read:Weight Loss Diet: ఈ ఆహార పదార్థాలతో కేవలం 8 రోజుల్లో బరువు తగ్గొచ్చు! నమ్మట్లేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Coconut Water: కొబ్బరి నీళ్లు అతిగా తాగుతున్నారా? అయితే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే