Benefits of Dates: ఖర్జూరంలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. రోజూ ఇవి తక్కువ మెుత్తంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. డేట్స్ ను ఔషదాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఖర్జూరంలో ప్రొటీన్స్, ఫైబర్, విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ దీనిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ డైట్‌లో కళ్లకు మంచిదని వైద్యులు చెబుతారు. బరువును తగ్గించడం, మలబద్దకాన్ని దూరం చేయడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. డేట్స్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
ఖర్జూరం తినడం వల్ల కలిగే ఉపయోగాలు
** ఖర్జూరంలో యాంటీయాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెద్దగా ఉండదు.
** డేట్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
** ఖర్జూరంలో కాల్షియం కావాల్సినంత ఉంటుంది. డేట్స్ తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
** చాలా మంది మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఖర్జూరం తినడం వల్ల ఆ సమస్యకు చెక్ పెటొచ్చు.
** డేట్స్ మెదడు పనితీరు మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తి పెంచడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది.
** ఖర్జూరంలో ఉండే పోషకాలు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా ఇమ్యూనిటీని పెంచుతాయి.
** ఇందులో పైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం దరిచేరదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Turnips Benefits: టర్నిప్ కూరగాయతో అంతులేని ఆరోగ్యం మీ సొంతం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook