Stand-up India Scheme: బిజినెస్ చేయాలని ఉందా? మోదీ సర్కార్ అందిస్తున్న రూ.1 కోటి రూపాయల కోసం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..!!

Stand-up India Scheme: కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో వినూత్నమైనటువంటి విధానాలు అవలంబిస్తోంది.ఇందులో భాగంగా అట్టడుగు స్థాయి నుంచి పారిశ్రామికంగా తమకంటూ ఒక గుర్తింపు పొందాలని ఆరాటపడుతున్న యువత కోసం ప్రత్యేకమైన పథకాలు రూపొందించింది.ముఖ్యంగా స్టాండ్ అప్ ఇండియా పేరిట అందిస్తున్న రుణాలకు మంచి ఆదరణ లభిస్తోంది.

Written by - Bhoomi | Last Updated : Jul 28, 2024, 02:44 PM IST
Stand-up India Scheme: బిజినెస్ చేయాలని ఉందా? మోదీ సర్కార్ అందిస్తున్న రూ.1 కోటి రూపాయల కోసం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..!!

Stand-up India Scheme: కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో వినూత్నమైనటువంటి విధానాలు అవలంబిస్తోంది.ఇందులో భాగంగా అట్టడుగు స్థాయి నుంచి పారిశ్రామికంగా తమకంటూ ఒక గుర్తింపు పొందాలని ఆరాటపడుతున్న యువత కోసం ప్రత్యేకమైన పథకాలు రూపొందించింది.ముఖ్యంగా స్టాండ్ అప్ ఇండియా పేరిట అందిస్తున్న రుణాలకు మంచి ఆదరణ లభిస్తోంది.ఈ రుణాలను అందుకునేందుకు ఎస్సీ లేదా ఎస్టీ మహిళా అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు.

ఈ స్కీం కింద చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (SIDBI) 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు రుణాలను అందిస్తోంది. ఈ రుణాలను మీరు సులభ వాయిదాలలో చెల్లించుకోవచ్చు.అంతేకాదు మీరు బిజినెస్ చేయాలి అనుకున్నట్లయితే, మీకు సుమారు కోటి రూపాయల వరకు రుణం అవసరం అయినప్పుడు…స్టాండ్ అప్ ఇండియా లోన్ కు అర్హులైన ఎస్సీ ఎస్టీ మహిళలను భాగస్వామిగా చేర్చుకోవచ్చు.అయితే వారికి కనీసం మీ కంపెనీలో 51 శాతం వాటాను అందించినట్లయితే మీ వ్యాపారానికి కోటి రూపాయల వరకు రుణం లభించే అవకాశం ఉంటుంది.అయితే ప్రాజెక్టు వ్యయంలో 15 శాతం మాత్రం మీరు చెల్లించాల్సి ఉంటుంది. 

స్టాండ్ అప్ ఇండియా నిబంధనలు ఇవే:

లోన్ కోసం అప్లై చేసే మహిళ కనీసం 18 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. అయితే ఈ రుణాలను గ్రీన్ ఫీల్డ్  ప్రాజెక్టులకు మాత్రమే అందిస్తారని గుర్తుంచుకోవాలి. అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇందులో ప్రధానంగా ఉంటాయి. అదేవిధంగా రుణం పొందే వ్యక్తి గతంలో మరే బ్యాంకుకు ఋణ ఎగవేతదారు అయి ఉండకూడదు.

స్టాండ్ అప్ ఇండియా రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

స్టాండ్ అప్ ఇండియా దరఖాస్తు కోసం మీరు నేరుగా బ్యాంకుకు వెళ్ళవచ్చు లేదా వెబ్ పోర్టల్ లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read : Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీంపై మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఏం చెప్పింది..? OPS vs NPS వివాదం గురించి తెలుసుకుందాం.!!

స్టాండ్ అప్ ఇండియా స్కీం కింద ఏ వ్యాపారం చేయాలి?

స్టాండప్ ఇండియా స్కీం ప్రకారం మీరు వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు చేసినట్లయితే మీకు రుణం త్వరగా లభిస్తుంది. ఇందులో ముఖ్యంగా చేప పిల్లల పెంపకం, పౌల్ట్రీ, అలాగే పాల ఉత్పత్తి కేంద్రాలు, అగ్రో ఇండస్ట్రీస్, ఫిషరీస్, అగ్రి క్లినిక్, అగ్రి బిజినెస్ సెంటర్ అదేవిధంగా నూతన వ్యవసాయ విధానాలకు సంబంధించిన వ్యాపారాలు తదితర యూనిట్లకు ఈ రుణం పొందేందుకు అర్హతలుగా చెప్పవచ్చు.

ఈ రుణాలపై వడ్డీ రేటు 11 - 13 శాతం ఉండే అవకాశం ఉంటుంది. ఈ రుణాన్ని 7 సంవత్సరాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.  మీకు సుమారు 18 నెలల మారటోరియం కూడా ఉంటుంది.

Also Read: NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News