Kajal Side effects: కంటికి కాటుక అందం అంటారు. కానీ, ప్రస్తుతం ఆ ట్రెండ్ మారిపోయింది. కాటుక పెట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు ఇందులో వాడే కెమికల్స్ వల్ల కంటికి ప్రమాదంగా మారుతుంది. కాటుక పెట్టుకోవడం వల్ల కలిగే సైడ్‌ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం.
కంటికి కాజల్ పెట్టుకుంటే ఆ అందమే వేరు. అయితే, ప్రస్తుతం కాటుక వాడటం వల్ల ఇతర సైడ్‌ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి కంటి చూపు ప్రాణాంతకంగా మారుతుంది. బ్యూటీ రొటీన్‌లో కాటుక పెట్టుకోవడం వల్ల కలిగే సైడ్‌ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
కంటి చుట్టూ ఉన్న కంట కణాలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కాటుకలో వాడే కెమికల్స్ కంటిని దెబ్బతీస్తాయి ఇవి ప్రమాదంగా మారుతాయి. కంటికి కాటుక పెట్టుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటో తెలుసుసుకుందాం.
కళ్ళు పొడిబారటం..
కంటికి తరచుగా కాటుక అప్లై చేసి ఎక్కువసేపు అలాగే రోజంతా ఉంచుకోవడం వల్ల కళ్లు పొడిబారతాయి. ఇందులో ఉండే కెమికల్స్ పిగ్మెంట్స్ కంటి చుట్టూ దురదలను తీసుకువస్తాయి. దీంతో కళ్లు పొడి పారిపోతాయి, ఎరుపు రంగులోకి మారిపోతాయి.
ఇదీ చదవండి: ఈ ఒక్క చుక్క రాత్రిపడుకునే ముందు ముఖానికి రాసుకోండి ఉదయం నమ్మలేని మ్యాజికల్ గ్లో చూస్తారు..
ఫోర్స్..
ఇలా కంటి చుట్టూ కాటుక అప్లై చేయడం వల్ల ఐ ల్యాష్,పైన లైన్స్ యాక్నే మంట దురదలు వస్తాయి. కాటుక తయారీలో ఉపయోగించే ఆయిల్స్, వ్యాక్స్ ఇతర వ్యర్ధాలు ఏవైనా ఉండటం వల్ల కూడా కంటికి అనారోగ్యంగా మారుతాయి. దీని వల్ల మచ్చలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
ఐ లాష్..
కంటికి కాటుక అప్లై చేయడం వల్ల ఐలాష్ డ్యామేజ్ అవుతుంది. కళ్ళు పొడిబారటం వల్ల కనురెప్పలు రాను రాను చిన్నగా తగ్గిపోతూ ఉంటాయి పెరగడం ప్రారంభించవు.
సున్నితత్వం..
కంటికి కాటు ఎక్కువ సమయం పాటు పెట్టుకోవడం వల్ల సున్నితంగా మారతాయి. కళ్లలో కాటుకలో కెమికల్స్ కంటి చుట్టూ పొడిబారటం వల్ల దాన్ని ఎక్కువసేపు రుద్దుతాం. ఇలా చేయడం వల్ల కళ్ళు మరింత సున్నితంగా మారిపోతాయి.
ఇదీ చదవండి: సోహా అలీ ఖాన్ ఫీట్ గా ఉండటానికి బ్రేక్ ఫాస్ట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్ తీసుకుంటారు..
ఐ ఇన్ఫెక్షన్..
అంతేకాదు కెమికల్స్ వేసి కాటుక తయారు చేస్తారు కాబట్టి కాజల్ ధరించటం వల్ల ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఫంగీ కంటి చుట్టూ ఉన్న మాయిశ్చర్ ని తగ్గిస్తాయి. గడువు ముగిసిన కాజల్, కాటుక ఉపయోగిస్తే కాంతికి మరింత ప్రమాదకరంగా మారుతుంది దీనివల్ల కళ్ళ కలక ఇతర కంటి సమస్యలు చుట్టూ ముడుతాయి దీంతో వైద్యులను సంప్రదించక తప్పదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.