Dry Skin Treatment: చర్మం పొడిగా ఉంటుందా? ఈ టిప్స్‌ని ట్రై చేయడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం

Food For Dry Skin: సాధారణంగా కొంతమంది చర్మం పొడిగా ఉంటుంది. డ్రై స్కిన్‌ వల్ల వయసు పైబడినట్లు కనిపిస్తుంది. దీని వల్ల అందహీనంగా కనిపిస్తారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2024, 03:28 PM IST
Dry Skin Treatment: చర్మం పొడిగా ఉంటుందా? ఈ టిప్స్‌ని ట్రై చేయడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం

Food For Dry Skin: చర్మం డ్రైగా మారడానికి ముఖ్య కారణం శరీరంలో తగినంత నీరు తీసుకోకపోవడం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  దీని కారణంగా చర్మం అందహీనంగా కనిపిస్తుంది. కాబట్టి శరీరానికి తగినంగ నీరు తీసుకోవడం చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  అయితే చర్మం డ్రైగా మారకుండా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది.

బాదంపప్పు: 

చర్మ పొడి బారకుండా ఉండడంలో బాదంపప్పులు ఎంతో సహాయపడుతుంది. ఇందులో విటమిన్‌ ఈ ,  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మం తేమగా ఉంటుంది. 

టొమాటో: 

టొమాటో తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోకి లైకోపీన్‌, యాంటీ ఆక్పిడెంట్‌ గుణాలు చర్మ సంరక్షణలో ఎంతో ఉపయోగపడుతాయి. అంతేకాకుండా అధిక నీరు, విటమిన్‌ సి కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి టొమాటో తీసుకోవడం చర్మానికి ఎన్నో లాభాలు పొందుతారు. 

చియా విత్తనాలు: 

చియా విత్తనాలు తీసుకోవడం వల్ల ఒమేగా-౩, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అనేక పోషకాలు అందుతాయి. ఇవి స్కిన్‌ డీహైడ్రేషన్‌ బారిన పడకుండా సహాయపడుతాయి. 

కొబ్బరినీళ్లు: 

ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే పొడిబారకుండా సహాయపడుతుంది.

పెరుగు:

చర్మ సంరక్షణలో పెరుగు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్‌  గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. అలాగే ఆరోగ్యంగా ఉండేలా  చేస్తుంది.

వాల్‌నట్‌:

డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్‌ ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల ఒమేగా-౩ ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్లు అధికంగా లభిస్తాయి. అంతేకాకుండా చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఆరెంజ్‌:

పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆరెంజ్‌ పండులో ఉండే పోషకాలు చర్మం పొడి బారకుండా ఉండేలా చేస్తాయి. 

Also Read Oily Skin: ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాయిశ్చరైజర్ ఈ విధంగా రాయండి.. ముఖం మెరిసిపోతుంది..

ద్రాక్ష:  

ద్రాక్షలో విటమిన్‌ సి అధికంగా లభిస్తుంది. దీని వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి పెంచుతుంది. దీని వల్ల చర్మం తేమను పొందుతుందని నిపుణులు చెబుతున్నారు. 

దోసకాయ: 

దోసకాయ అనేది చర్మ సంరక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలోని అధిక నీరు చర్మం పొడి బారకుండా రక్షిస్తుంది. చర్మం డిహైడ్రేట్‌ సమస్య బారిన పడకుండా ఉండేలా చేస్తుంది. 

Also Read Unhealthiest Breakfast Foods: బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News