Iron Rich Foods: ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడానికి ప్రతి రోజు ఆరోగ్యకరమైన పోషకాలు అధికంగా ఉండడం ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వివిధ రకాల పోషకాలు కలిగిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీర అభివృద్ధికి సహాయపడుతుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో ఐరన్ లోపం వంటి సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంది శరీరంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కీలక పాత్ర పోషిస్తుంది.
శీతాకాలంలో చాలా మంది ఐరన్ లోపం సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణంలోని తేమ పెరగడం కారణంగా చాలా మందిలో రక్తహీనత సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలోని ఐరన్ పరిమాణాలు తగ్గడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కొన్ని ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
పాలకూర:
పాలకూరలో ఐరన్ పరిమాణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారాల్లో పాలకూరను అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కళ్లు, ఎముక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అధిక రక్తపోటుతో బాధపడేవారికి కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
దానిమ్మ పండ్లు:
ఎర్రటి గింజలు కలిగిన దానిమ్మ పండ్లను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని ఐరన్‌ను పెంచే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దానిమ్మలో ఉండే ఫైబర్, క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
యాపిల్:
యాపిల్ పండ్లు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ప్రతి రోజు ఉదయం పూట యాపిల్స్‌ను తినడం వల్ల బాడీకి తగిన మోతాదులో పోషకాలు లభిస్తాయి. దీంతో పాటు తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook