IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ.. బడ్జెట్‌లో ఒకేసారి ఇలా 5 ప్రాంతాలను చుట్టేయండి..

IRCTC Tour Package From Hyderabad: ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీల ద్వారా ఒకేసారి వివిధ ప్రాంతాలను తక్కువ బడ్జెట్‌లో ఫ్యామిలీతోపాటు సందర్శించే అవకాశం లభిస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 30, 2024, 12:35 PM IST
IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ.. బడ్జెట్‌లో ఒకేసారి ఇలా 5 ప్రాంతాలను చుట్టేయండి..

IRCTC Tour Package From Hyderabad: ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీల ద్వారా ఒకేసారి వివిధ ప్రాంతాలను తక్కువ బడ్జెట్‌లో ఫ్యామిలీతోపాటు సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలు ప్రయాణీకులకు ట్రావెల్‌తోపాటు ఫుడ్, హోటల్‌ సౌకర్యం కూడా అందిస్తోంది. ముఖ్యంగా ఎంతో భద్రమైన భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా టిక్కెట్లు అతి తక్కువలోనే బుక్ చేసుకుని జర్నీ చేయవచ్చు.  ఈరోజు హైదరాబాద్ నుంచి తక్కువ బడ్జెట్లో 5 ప్రాంతాలకు ఎలా సందర్శించవచ్చో వివరాలు తెలుసుకుందాం.

ఇదీ చదవండి: ఎండలో మేకప్ జిడ్డుగా మారిపోతుందా? ఈ 6 టిప్స్ మీకోసం..

ఈ ప్రత్యేక ఐఆర్‌సీటీసీ టూర్ ఏప్రిల్ 3న హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ 4 రాత్రులు, 5 పగళ్లు ఉంటుంది. ఈ బడ్జెట్‌ ప్యాకేజీ ద్వారా అహ్మదాబాద్, రాజ్‌కోట్‌, సోమనాథ్‌, వడోదర, ద్వారకను సందర్శింవచ్చు. ఈ ఫ్యాకేజీ ప్రతి బుధవారం అందుబాటులో ఉండనుంది. ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ ద్వారా ఏడు రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ఫ్లైట్ ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో ఏప్రిల్ 3 మధ్యాహ్నం 2.35 నుంచి ఫైట్‌ జర్నీ ఉంటుంది. 

ఇదీ చదవండి: ఈ బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారు పొరపాటున కూడా చికెన్, మటన్ తినకూడదు..
ఈ ప్యాకేజీలో భాగంగా ఐఆర్‌సీటీసీ ప్రయాణీకులకు 4 బ్రేక్‌ఫాస్ట్‌లు, 4 డిన్నర్లను అందిస్తుంది. ముఖ్యంగా ఈ ప్యాకేజీ హైదరాబాద్‌ నుంచి ఏప్రిల్‌ 3న ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ ద్వారా మీరు ఒంటరిగా ప్రయాణించాలనుకుంటే ధర రూ. 33,350 చెల్లించాల్సి ఉంటుంది. కపుల్స్ వెళ్లాలని ప్లాన్ చేస్తే ఒక్కరికి రూ.26,700 చొప్పున, ముగ్గురు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి రూ.25,650 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలను వెంట తీసుకువెళ్తే ప్రత్యేకంగా రూ.17,550 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్యాకేజీ హైదరాబాద్, సికింద్రాబాద్, పూణే, షోలాపూర్ ద్వారా రైలు స్లీపర్ కోచ్ ద్వారా ప్రయాణించే సదుపాయం కూడా ఉంది. ఇది ఒక్కో వ్యక్తికి రూ.28,280 ఉంటుంది. ముగ్గురు కలిసి వస్తే ఒక్కో వ్యక్తికి రూ. 27,610 చెల్లించాల్సి ఉంటుంది. మీరు మీ పిల్లలను కూడా మీ వెంట తీసుకుని వెళ్లాలనుకుంటే ప్రత్యేకంగా రూ.20020 చెల్లించాల్సి ఉంటుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News