Indigo Plant For White Hair To Black: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి 15 రోజులకు ఒకసారి రసాయనాలు అధికంగా ఉండే హెయిర్ డైలను వినియోగిస్తూ ఉంటారు. వీటిని తరచుగా జుట్టుకు వినియోగించడం వల్ల జుట్టు క్రమంగా సిల్కీగా మారడం ప్రారంభమవుతుంది. దీంతో తొందలోనే తెల్ల జుట్టు రాలడం ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి నాచురల్ లభించే హెన్నతో కూడి ప్రోడక్ట్స్‌ను కూడా వినియోగిస్తున్నారు. అయినప్పటీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు తెలిపిన ఓ చెట్టు ఆకుల మిశ్రమాన్ని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు నుంచి జుట్టును నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే ఖరీదైన ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం ఇక నుంచి మానుకోవాలని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు..అయితే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు నీలి మొక్క(Indigo Plant)ను వాడడం వల్ల సులభంగా తెల్ల జుట్టు పోతుందని వారు అంటున్నారు. ఈ మొక్కలో దాగి ఉన్న ఔషధ గుణాలు తెల్ల జుట్టు ప్రభావంతంగా నల్లగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు కూడా దృఢంగా చేస్తాయి. అయితే ఈ మొక్కను జుట్టుకు ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
రసాయనాలతో కూడిన హెయిర్ డైలు నెరిసిన జుట్టును మరింత డ్యామేజ్ చేస్తాయని, వీటికి బదులుగా నీలి మందు ఆకుల మిశ్రమాన్ని వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నార. నీలి మొక్కను ఆంగ్లంలో ఇండిగో ఫ్లాంట్ అంటారు. ఈ మొక్క ఆకుల్లో గ్లైకోసైడ్స్ సమ్మేళనాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అయితే వీటి నుంచి చాలా మంది ఆయుర్వేద నిపుణులు పొడిని కూడా తయారు చేస్తారు. ఈ పొడిని తయారు చేయడానికి ముందుగా ఆకులను నీటిలో నానబెట్టి, తరువాత పులియబెట్టాలి. ఆ తర్వాత ఈ మొక్క ఆకులు ఆక్సీకరణనానికి లోతైన నీలం రంగుగా మారుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఈ ఆకులకు నీలి ఆకులని పేరు వచ్చిందని సమాచారం..
నీలి ఆకుల పౌడర్ వల్ల కలిగే ప్రయోజనాలు:
నీలి(Indigo Plant) ఆకుల పౌడర్‌ను సహజమైన హెయిర్ డైగా వినియోగించవచ్చు. తరచుగా మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను వినియోగించేదానికి బదులుగా నీలి ఆకుల పౌడర్‌తో తయారు చేసిన డైని వినియోగించడం వల్ల జుట్టు త్వరగా నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టుకు సహజమైన మెరుపు కూడా లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు నెలకు 1 నుంచి 2 సార్లు ఈ డైని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Indigo Plant: ఈ మొక్కతో తెల్ల జుట్టు 7 రోజుల్లో మాయం, నమ్మట్లేదా? ట్రై చేయండి..