Relationship Tips: అబ్బాయిల్లో ఉండే ఈ 3 అమ్మాయిలకు చాలా ఇష్టం.. అలా ఉంటే వారిని ఎప్పుడూ వదులుకోలేరట..

Relationship Tips: రిలేషన్‌షిప్లో ఒకరి ఇష్టాలను మరొకరు అంగీకరించడం చాలా ముఖ్యం. ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటేనే ఆ రిలేషన్‌షిప్ జీవితాంతం కొనసాగుతుంది. ఒక్కరిపై మరొకరి నమ్మకం కూడా ముఖ్యం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 10, 2024, 06:47 PM IST
Relationship Tips: అబ్బాయిల్లో ఉండే ఈ 3 అమ్మాయిలకు చాలా ఇష్టం.. అలా ఉంటే వారిని ఎప్పుడూ వదులుకోలేరట..

Relationship Tips: రిలేషన్‌షిప్లో ఒకరి ఇష్టాలను మరొకరు అంగీకరించడం చాలా ముఖ్యం. ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటేనే ఆ రిలేషన్‌షిప్ జీవితాంతం కొనసాగుతుంది. ఒక్కరిపై మరొకరి నమ్మకం కూడా ముఖ్యం. రిలేషన్‌షిప్లో ఏది తక్కువైనా అది ఈజీగా బ్రేకప్ వరకు వెళ్లిపోతుంది. అయితే, రిలేషన్‌షిప్లో అబ్బాయిల్లో ఉండే కొన్ని లక్షణాలు అమ్మాయిలకు భళే నచ్చుతాయట. ఇలా అమ్మాయిలకు ఇష్టమైతే వారితో రిలేషన్‌షిప్లో చివరి వరకు ప్రయాణం చేస్తారట. అయితే, అబ్బాయిల్లో ఉండాల్సిన ఆ ప్రత్యేక లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.రిలేషన్‌షిప్లో ఒకరిపై మరొకరికి గౌరవం ఉండటం చాలాముఖ్యం. ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. అబ్బాయిలకు ఉండే కొన్ని అలవాట్లు అమ్మాయిలకు నచ్చకపోవచ్చు. అమ్మాయిల్లో ఉండే కొన్ని లక్షణాలు అబ్బాయిలకు నచ్చకపోవచ్చు. కానీ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఆ ఇద్దరి పై గౌరవమర్యాదాలు పెరుగుతాయి. దీనికి నమ్మకం అనేది పునాది లాంటిది. ఇది లేకుంటే రిలేషన్‌షిప్లో పునాదుల్లేని మేడే అవుతుంది. ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలీదు. అయితే, కొంతమంది అబ్బాయిల్లో ఉండే ఈ మూడు లక్షణాలు అమ్మాయిలకు చాలా ఇష్టం. ఇలాంటి అబ్బాయిలను వారు ఎప్పుడూ వదుకోలేరు.

కమ్యూనికేట్..
రిలేషన్‌షిప్లో ఒకరి మనసులో ఏముందో మరొకరు తెలుసుకోవాలి. ఓపెన్ గా మాట్లాడుకోవాలి అంటారు అమ్మాయిలు. వారితో ఏది దాయకుండా చెప్పాలని అనుకుంటారు. అలా ఏ విషయం దాయకుండా మాట్లాడే అబ్బాయిలు అంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట. అలాంటి వారితో ఎక్కువ రోజులు అంటే జీవితాంతం ప్రయాణం చేయడానికి ఇష్టపడతారట.

ఇదీ చదవండి: ఇంట్లో దొరికే ఈ 3 ఖరీదైన సన్‌స్క్రీన్ కంటే మెరుగు..  

ఇష్టాలు..
అమ్మాయిలకు తమ ఇష్టాలను అంగీకరించే అబ్బాయిలంటే ఎక్కువ ఇష్టమట. అలాకాకుండా అబ్బాయిల ఇష్టాలను తమ ఇష్టాలుగా రుద్దే మగవాళ్లంటే అమ్మాయిలకు అస్సలు నచ్చదట. వారి అభిప్రాయాలకు గౌరవమిచ్చి అంగీకరించేవారంటే భళే ఇష్టమట. అలాంటివారిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోరట.

ఇదీ చదవండి: ఈ ఎర్రని కూరగాయతో యూరిక్ యాసిడ్ సమస్య రాత్రికిరాత్రే మాయమవుతుంది..

అర్థం..
ముఖ్యంగా రిలేషన్‌షిప్లో అమ్మాయిలు అబ్బాయిలు తాము ఏం ఫీలావుతున్నారో అబ్బాయిలు అర్థం చేసుకోవాలి అనుకుంటారు. తమ ఎమోషన్స్ అబ్బాయిలు చెప్పకుండానే గుర్తుపట్టేయాలి. తమల్ని ఓదార్చాలి. బాధల్ని తెలుసుకోవాలని కోరుకుంటారు. తమ పై ఎక్కువ కేర్ తీసుకోవాలనుకుంటారు. ఇలా కాకుండా వ్యతిరేకంగా జరిగితే మాత్రం సంబంధాల్లో చీలిక ఏర్పడుతుంది. పట్టించుకోకుండా తేలిగ్గా వదిలేసే అబ్బాయిలతో అమ్మాయిలు కలకాలం కలిసి ఉండలేరట. వారి ప్రయాణానికి సగంలోనే బ్రేక్ పడుతుందట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News