Ice Cream Lassi Recipe In Telugu: భారతదేశవ్యాప్తంగా ఎండాకాలం ప్రారంభమైంది. అలాగే వేసవి ప్రారంభ సమయంలోనే ఎండలు భగభగమంటున్నాయి. అయితే ఇలాంటి సమయాల్లో ఎండల్లో తిరిగే వారికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా వేసవిలో బయట తిరిగే వారికి హైడ్రేషన్ సమస్యలతోపాటు వడదెబ్బ ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీకు మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం ఎంతో మంచిది. లేకపోతే ఎండాకాలం అంతా అనారోగ్య సమస్యల బారిన పడాల్సిందే. అయితే వేసవికాలంలో శరీరం హైడ్రేట్ గా ఉండడానికి చాలామంది లస్సీని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.
నిజానికి వేసవికాలంలో లస్సీని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండడమే కాకుండా పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ప్రోటీన్స్ ఎండా కారణంగా వచ్చే ఇతర అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి తప్పకుండా ఎండాకాలంలో లస్సీని తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది పిల్లలు దీనిని తాగేందుకు ఇష్టపడరు.. అయితే తాగని పిల్లల కోసం ఐస్ క్రీమ్ లస్సి రెసిపీని తయారు చేసి ఇవ్వండి. ఈ రెసిపీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే లస్సి లో ఉండే పులుపుదనం ఐస్ క్రీమ్ లో ఉండే తీయదనం రెండు ఒక కొత్త టేస్ట్ను అందిస్తాయి. కాబట్టి తప్పకుండా పిల్లలు దీనిని తాగడానికి ఇష్టపడతారు.
ఐస్ క్రీమ్ లస్సీ రెసిపీ (Ice Cream Lassi Recipe)
కావలసిన పదార్థాలు:
పెరుగు (Curd) - 1 కప్పు (cup)
పాలు (Milk) - ½ కప్పు (cup) (అవసరమైతే)
ఐస్ క్రీం - మీకు నచ్చిన రుచి (flavor) లో 2-3 స్పూన్లు (spoons)
చక్కెర (Sugar) - రుచికి తగినంత
ఏలకుల పొడి (Cardamom powder) - ఒక చిటికెడు(optional)
తయారీ విధానం:
ముందుగా ఒక మిక్సింగ్ జార్ లో పెరుగు, పాలు వేసి బాగా మిక్స్ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనిని ఓ పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఇలా పక్కన పెట్టుకున్న లస్సిలో ఐస్ క్రీం, చక్కెర, ఏలకుల పొడి వేసి మరోసారి బాగా మిక్సీ పట్టుకోవాలి.
ఇలా మిక్సీ పట్టుకున్న లస్సీ ఐస్ క్రీమ్‌ని గాజు గ్లాస్‌లో పోసి, వెంటనే సర్వ్ చేయండి.
లస్సీ మరింత చిక్కగా ఉండడానికి ఇందులో పాల క్రీమ్ ని కూడా కలుపుకోవచ్చు. అయితే ఇందులో చక్కెరకు బదులుగా తేనెను కలుపుకొని తీసుకుంటే మరిన్ని లాభాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter