Coriander Seeds Drink for Weight Loss : నేటి కాలంలో బరువు పెరగడం సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కష్టంగా మారింది. గంటల తరబడి కఠినమైన వ్యాయామాలు చేసిన బరువు తగ్గలేకపోతున్నారు. ఎలాంటి డైట్‌లు పాటించిన ఈ సమస్య నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా డైట్‌లో పాటించాలి. ముఖ్యంగా ప్రతిరోజూ పాటించే డైట్‌లో తప్పకుండా పలు డ్రింక్స్ కూడా తీసుకోవాలి. లేకపోతే బరువు తగ్గడం చాలా కష్టంగా మారుతుంది. ఎలాంటి డ్రింక్‌ను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం...
కొత్తిమీర గింజలతో తయారు చేసిన నీరు:
- పొట్ట, నడుము చుట్టు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కొత్తిమీర గింజలతో తయారు చేసిన నీరు చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల ప్రయోజనాలను చేర్చుతుంది. ఊబకాయాన్ని తగ్గించేందుకు కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది.
- చాలా మంది మహిళలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పొట్ట చుట్టూ కొవ్వు వేలాడుతూ ఇబ్బంది కరంగా తయారవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొత్తిమీర నీరు ప్రతి రోజూ తాగితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
- కొత్తిమీర గింజల్లో శరీరానికి కావాల్సిన పోషకాల అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, జింక్, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.
- కొత్తిమీర గింజల నీటిని తయారు చేయడానికి ముందుగా..కొత్తిమీర, మెంతులు, జీలకర్ర గింజలను తీసుకుని, వాటిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి..మరుసటి రోజు ఉదయం మరిగించి, వడకట్టిన తర్వాత త్రాగాలి. ఇలా వారాన్ని రెండు సార్లు తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి.
- బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేందుకు కొత్తిమీరు నీరు ప్రభావవంతంగా సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook