Winter Tips: క్యారెట్ తో చర్మ సంరక్షణ ఎలా ?

శీతాకాలమంటే కొందరికి ఆనందం. మరి కొందరికి ఇబ్బంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. బాహ్య సంరక్షణ చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో..

Last Updated : Oct 24, 2020, 11:18 PM IST
Winter Tips: క్యారెట్ తో చర్మ సంరక్షణ ఎలా ?

శీతాకాలమంటే ( Winter ) కొందరికి ఆనందం. మరి కొందరికి ఇబ్బంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. బాహ్య సంరక్షణ ( External skin care ) చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో..

చర్మ సంరక్షణ ( Skin protection ) అనేది చాలా కీలకం. ముఖ్యంగా చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో..బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం  ( Skin ) పొడి బారి..దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ( Soft skin ) ఉంచుకుంటే మంచిది. సహజసిద్దంగా మీ చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుకోవడమెలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం. కావల్సిందల్లా క్యారెట్ అంతే.

క్యారెట్ ( Carrot ) సగం ముక్కను తురుం చేసి లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో  పేస్ట్ గా చేయాలి.  ఇందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ పాలు వేసి బాగా కలిపి చర్మానికి రాయాలి. 15 నిమిషాలుంచుకున్నాక...చల్లని నీళ్లతో కడగాలి. క్రమం తప్పకుండా ఇలే చేస్తే..మీ చర్మం చర్మం తేమగా..మృదువుగా ఉంటుంది. ఇదే మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ ( Carrot paste as face pack ) ‌గా వేసుకోవచ్చు. Also read: Mental Stress: మానసిక ఒత్తిడిని కలిగించే అంశాలేంటి ? ఎలా తగ్గించుకోవచ్చు ?

ఇక ఆయిలీ స్కిన్ ( Oily skin ) ఉన్నవారికి సైతం క్యారెట్లతో చాలా ప్రయోజనం కలుగుతుంది.  ఒక కప్పు క్యారెట్ జ్యూస్ ( Carrot juice ) లో ఒక్కో టేబులు స్పూన్ పెరుగు, శెనగ పిండి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. ఓ అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే..ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి పొందవచ్చు.

ఇక చర్మం తాజాగా మారడానికి, ముఖ సౌందర్యం ( Face Beauty ) పెంచుకోడానికి కూడా క్యారెట్ బాగా పని చేస్తుంది. క్యారెట్ జ్యూస్, పెరుగు, ఎగ్ వైట్ లను సమపాళ్లలో కలుపుకుని..ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచుకుని గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం ఫ్రెష్ అవుతుంది. 

సన్ ప్రొటెక్షన్ స్ప్రేగా కూడా క్యారెట్ ఉపయోగపడుతుంది.  క్యారెట్ జ్యూస్, రోజ్ వాటర్‌ ( Rose Water ) ను సమపాళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపి ఉంచుకోవాలి. సన్ ప్రొటెక్షన్ స్ప్రేగా ( Sun protection spray ) వాడుకుంటే సన్ లైట్, దుమ్ము, ధూళి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఇక క్యారెట్, అలోవెరా జ్యూస్‌లను కలిపిన మిశ్రమాన్ని రాసుకుంటే  చర్మ సౌందర్యం పెరిగి ముఖానికి కళ వస్తుంది.  Also read: Happy Dussehra 2020: సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్

Trending News