Dengue Effect: డెంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. ఈ టిప్స్ పాటించకుంటే రిస్క్ లో పడ్డట్లే.. నిపుణుల సూచనలివే..

Dengue Precautions: వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వ్యాప్తిచెందుతాయి. ముఖ్యంగా దోమలు ఈ వేళల్లో ఎక్కువగా కుడుతుంటాయి. దీంతో చాలా మంది డెంగ్యూ బారిన పడి  ఇబ్బందులు పడుతుంటారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 19, 2024, 09:28 PM IST
  • కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షం..
  • వ్యాప్తి చెందుతున్న డెంగ్యూ ఫీవర్..
Dengue Effect: డెంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. ఈ టిప్స్ పాటించకుంటే రిస్క్ లో పడ్డట్లే.. నిపుణుల సూచనలివే..

How to prevent from dengue mosquitoes and treatment precautions:  కొన్నిరోజులుగా భారీ వర్షం కురుస్తుంది. జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇదిలా ఉండగా.. వర్షం వల్ల అనేక ప్రాంతాల్లో నీళ్లు నిల్వఉండిపోతాయి. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతుంటాయి. ఇంటి చుట్టుపక్కల మురికి నీరు నిలిచిపోయి ఉంటుంది. చెత్తా,చెదారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా వర్షం వల్ల తెలంగాణలో డెంగ్యూ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది చిన్నారులు డెంగ్యూ బారినపడుతున్నారు. దోమలు కుట్డడం వల్ల శరీరానికి విపరీతంగా దద్దులు వస్తాయి. చాలా మంది ప్టేట్ లెట్స్ సైతం పడిపోతున్నాయి.

డెంగ్యూ సింప్టమ్స్..

 మొదటగా దోమలు కాటు వేయగానే.. శరీరంపై దద్దుర్లు వస్తాయి. క్రమంగా తలనొప్పి,  వికారం, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. రెండు , మూడు రోజులు ట్యాబ్లెట్స్ తీసుకున్న కూడా తగ్గకపోతే.. వెంటనే డెంగ్యూ టెస్టులు చేయించుకొవాలి. రక్తపు సాంపుల్స్ టెస్టులలో డెంగీ డిటెక్ట్ అవుతుంది. డెంగీ ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ.. నార్మల్ వ్యక్తిని కుడితే.. అతనికి కూడా డెంగ్యూ సోకుతుంది. ఇమ్యునిటీ తక్కువగా ఉండే వారిలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు..

డెంగీసోకగానే.. 4 నుంచి పదిరోజుల వరకు ఈ సింప్టమ్స్ ఉంటాయి. 
ఆకస్మిక అధిక జ్వరం (105 డిగ్రీలు)
వాంతులు, విరేచనాలు,
భరించలేని తలనొప్పి
కళ్ళు, నడుము నొప్పి, కండరాల నొప్పి
అలసట, వాంతులు అవుతున్నాయి
చర్మంపై దద్దుర్లు,  తేలికపాటి రక్తస్రావం జరుగుతుంది. 

కొన్నిసార్లు డెంగ్యూ తీవ్రతరమై.. రక్త నాళాలు దెబ్బతినడం, ముక్కు మరియు చిగుళ్ళ నుండి రక్తస్రావం, కాలేయం పెద్దదిగా,  రక్త ప్రసరణ వ్యవస్థ వైఫల్యం వంటి అరుదైన సమస్యలు కూడా సంభవిస్తాయి. చిన్న పిల్లలు, పెద్దవారు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

డెంగ్యూ నివారణ..

ముఖ్యంగా వర్షం పడగానే నీళ్లు ఎక్కడ కూడా నిల్వఉండకుండా చూసుకొవాలి. దోమతెరలను తప్పనిసరిగా ఉపయోగించాలి. చెత్త,చెదారం ను క్లీన్ చేసుకొవాలి. దోమ తెరలను ఉపయోగించాలి. దోమలు కుట్టకుండా ఒడోమాస్, ఆయింట్ మెంట్ లను కాళ్లు,చేతులకు పూసుకొవాలి. ఇంట్లో పాత టైర్లు, కూలర్లలో నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. ఎండి పోయిన వేప ఆకుల్ని ఇంట్లో ఒక దగ్గర కాల్చాలి. దీన్నుంచి వచ్చే పొగ వల్ల దోమలు పారిపోతాయి. కొన్నిరకాల సిట్రస్ నిమ్మ మొక్కల వల్ల దోమలు ఉండవు. వేప నూనెలను మనశరీరానికి అప్లై చేస్తే దోమలు కుట్టవు.

Read more: TGPSC Group 2: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 2 ఎగ్జామ్ లు వాయిదా.. మరల ఎప్పుడంటే..?  

డెంగ్యూ రాకుండా తీసుకొవాల్సిన ఫుడ్స్..

ఇమ్యునిటీ శక్తివంతంగా ఉంటే దోమలు అంత ఈజీగా మనమీద దాడులు చేయవు. అందుకే ప్రతిరోజు మంచి ప్రూట్స్ లను రెండు పూటల తినాలి. మొలకెత్తిన గింజలను తినాలి. డ్రైఫ్రూట్స్ లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలను ఎక్కువగా తినాలి. విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉన్న పోషకాలను ఎక్కువగా తినాలి. ఇలా తీసుకుంటే, జాగ్రత్తలు పాటిస్తే డెంగీ నుంచి రిలీఫ్ ను పొంద వచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News