Chicken Soup: చికెన్ సూప్‌ను త‌యారు చేయ‌డం ఎలాగంటే..?

Chicken Soup Recipe: మన రోగనిరోధక శక్తిని పెంచడంలో కొన్ని సూప్‌లు ఉపయోగపడుతాయి. దీనిని వల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే చికెన్‌ సూప్‌ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2024, 09:21 PM IST
Chicken Soup: చికెన్ సూప్‌ను త‌యారు చేయ‌డం ఎలాగంటే..?

Chicken Soup Recipe: శరీరానికి కొన్ని రకాల సూప్‌ తీసుకోవడం రోగనిరోధక శక్తి పెరుగుతంది. దీని వల్ల సీజన్‌లో వచ్చే అనారోగ్యసమస్యల బారిన పడాల్సిన అవసరం రాదు. అయితే సూప్‌లో అందరు తీసుకొనేది చికెన్‌ సూప్ . పిల్లలు, పెద్దలు ఎక్కువగా, ఇష్టంగా తింటారు. దీని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా సీజన్‌లో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఫ‌లితంగా వ్యాధుల నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు. ఇక మ‌న‌కు శ‌క్తిని, పోష‌ణ‌ను అందించే ఆహారాల్లో చికెన్ సూప్ కూడా ఒక‌టి. ఇది ఎంతో ఆరోగ్య‌వంత‌మైంది. దీన్ని ఈ సీజ‌న్‌లో తాగితే మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే చికెన్ సూప్‌ను మ‌నం ఇంట్లోనే సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ సూప్ కి కావాల్సిన ప‌దార్థాలు:

పావుకిలో  – బోన్‌లెస్ చికెన్

ఒక  కప్పు - పాలకూర తరుగు

 పావు కప్పు– క్యారెట్ తరుగు

ఒక టీస్పూన్ – చక్కెర

చిటికెడు –  మిరియాల పొడి

రెండు టీస్పూన్లు - ఉల్లికాడల తరుగు

పావు కప్పు –  బీన్స్ తరుగు

ఒక టీస్పూన్ –  వెల్లుల్లి తరుగు

ఒక టీస్పూన్ – పచ్చిమిర్చి త‌రుగు

ఒక టీస్పూన్ – కార్న్ ఫ్లోర్

ఒక టీస్పూన్ - నూనె 

తగినంత - ఉప్పు

చికెన్ సూప్ ను త‌యారు చేసే విధానం:

ముందుగా చికెన్ ను శుభ్రం చేసి పెట్టుకోవాలి. చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించాలి.  కడాయిలో నూనె పోసి క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. చికెన్‌ను వేసి దాన్ని ఉడికించిన నీళ్ల‌ను పోసి చక్కెర, ఉప్పు, పాలకూర తరుగు, ఉల్లికాడ‌ల త‌రుగు, కార్న్ ఫ్లోర్‌, మిరియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి.  

దీన్ని పది నిమిషాలు ఉడికించాలి. దీంతో చికెన్ సూప్ రెడీ అవుతుంది. ఇది మ‌న‌కు ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌ది. ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. 

Also Read Avoid Water After Eating Foods: ఇవి తిన్న తర్వాత నీళ్లు తాగరాదు.. కచ్చితంగా గుర్తుపెట్టుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News