Oats Idli Recipe: ప్రస్తుత కాలంలో చాలా మంది ఓట్స్‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి. దీని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య కూడా తగ్గుతారు. ఓట్స్‌ను మనం పాలులో, ఫ్రూట్స్‌తో కలిపి తీసుకుంటాము. కానీ ఈ ఓట్స్‌ను చాలా మంది నేరుగా తినడానికి ఇష్టపడారు. చాలా మంది ఓట్స్‌ను తీసుకోకుండా ఉంటారు. అయితే ఓట్స్ నేరుగా ఇష్టం లేనివారిని ఈ రెసిపీ ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్‌తో ఇడ్లీలు తయారు చేసి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఓట్స్‌తో తయారు చేసి ఇడ్లీలు ఎంతో రుచికరంగా ఉంటాయి. దీని ప్రతిరోజు ఉదయం, రాత్రి పూట తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి.
ఓట్స్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు:
ఒక కప్పు ఓట్స్, అర కప్పు ఉప్మా రవ్వ, అర కప్పు పెరుగు, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ వంటసోడా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర
Also Read Barley Water: బార్లీ వాటర్ తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా?
ఓట్స్ ఇడ్లీ తయారీ విధానం:
ముందుగా ఓట్స్ తీసుకోవాలి. కళాయిలో వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత రవ్వను తీసుకోవాలి. దీని కూడా వేయించుకోవాలి. ఒక జార్లో ఓట్స్‌ను మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రవ్వ, పెరుగు వేసి కలుపుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకోవాలి. వీటిని పదిహేను నిమిషాల పాటుఉ నానబెట్టుకోవాలి. తరువాత ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిలో ఉప్పు, వంటసోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇడ్లీలు ఉడికిన తరువాత బయటకు తీసి కొద్దిగా చల్లారిన తరువాత ప్లేట్ లో వేసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ ఇడ్లీలు తయారవుతాయి.
ఉదయం పూట సమయం తక్కువగా ఉన్న వారు ఈ వెరైటీ డిష్‌ను తయారు చేసుకోవచ్చు. ఓట్స్ తో రుచిగా తయారు చేసిన ఇడ్లీలు ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తాయి.
Also Read Foods To Reduce Fever: జ్వరంతో బాధపడుతున్నారా.. వీటిని తీసుకుంటే సమస్యకు చెక్ !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter