How To Detox The Body: శరీరాన్ని డిటాక్స్ చేసే సాధారణ మార్గాలు ఇవే, ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా చేయండి

How To Detox The Body Naturally: శరీరంలోని టాక్సిన్స్ బయటకి రావడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 17, 2023, 05:34 PM IST
 How To Detox The Body: శరీరాన్ని డిటాక్స్ చేసే సాధారణ మార్గాలు ఇవే, ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా చేయండి

How To Detox The Body Naturally: శరీరాన్ని ఎప్పటికప్పుడు డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే బాడీని క్రమం తప్పకుండా డిటాక్స్ చేయడం వ్యర్థ పదార్థాలు సులభంగా బయటకు వస్తాయి. అంతేకాకుండా తీవ్ర వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  శరీర నిర్విషీకరణ కారణంగా శరీరం కూడా ఫిట్‌గా తయారవుతుంది. ఊబకాయం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరాన్ని తరచుగా డిటాక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏయే పద్ధతుల్లో శరీరాన్ని నిర్విషీకరణ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శరీరాన్ని డిటాక్స్ చేసే మార్గాలు:
నిమ్మకాయ రసం:

నిమ్మకాయలో సోడియం, ఐరన్, విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని సులభంగా నిర్విషీకరణ చేయడానికి నిమ్మకాయ రసాన్ని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తరచుగా రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడేవారికి కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గుతారు.

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

క్యాలీఫ్లవర్:
క్యాలీఫ్లవర్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా దీనిని సలాడ్స్‌లో వినియోగించడం వల్ల శరీరం సులభంగా డిటాక్స్ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఇందులో ఉండే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

కొబ్బరి నీరు:
కొబ్బరి నీరు ఔషధ జలంగా భావిస్తారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే చాలా రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు కొబ్బరి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు రావడమే కాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో సోడియం, పొటాషియం, విటమిన్ సి కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్స్‌ లోపంతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని రోజు తాగాల్సి ఉంటుంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News