Hotel Style Set Dosa Recipe In Telugu: దోశను రోజు తిని తిని బోర్ కొడుతున్న వారి కోసం ఈరోజు ప్రత్యేక రెసిపీని పరిచయం చేయబోతున్నాం. సెట్ దోశ పేరు వినగానే అందరికీ నోరూరిపోతుంది. ఈ దోశ చూడడానికి స్పాంజీ లాగా మెత్తగా ఉంటుంది. ఇక రుచి విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ దోష ఎక్కువగా ఫేమస్. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొన్ని హోటల్స్ లో కూడా లభిస్తోంది. చాలామంది దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం ఎంతో కష్టమని అనుకుంటారు. కానీ దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. ముఖ్యంగా ఈ సెట్ దోశను ఉదయాన్నే టిఫిన్ గా ఇవ్వడం వల్ల హెల్తీగా కూడా ఉంటారు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ సెట్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు:
ఒక కప్పు మినప పప్పు
సగం కప్పు దోష బియ్యం
రెండు టేబుల్ స్పూన్ల మెంతులు
అరకప్పు దొడ్డు అటుకులు
మిశ్రమానికి కావాల్సినంత నీరు
తగినంత ఉప్పు
ఒక టీ స్పూన్ ధనియాలు
తయారీ విధానం:
ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది అందులో అటుకులు మినప్పప్పు బియ్యం మెంతులు పోసుకొని నీటితో బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ కప్పు నిండా నీటిని పోసుకొని 5 గంటలపాటు పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇలా నానిన వీటిని తీసుకొని గ్రైండర్ లో వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దోశ వాటర్ బ్యాటర్ ల పిండిని బాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిపై ఒక మూత పెట్టి రాత్రంతా పులియ పెట్టాలి.
ఇలా రాత్రంతా పులియబెట్టిన పిండిని తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. దోషపోసే ముందు పిండి మిశ్రమం మరి ఎక్కువగా పలచగా ఉండకుండా చూసుకోవాలి. స్టవ్ పై నాన్ స్టిక్ తవ్వాను పట్టుకొని ఊతప్పం ఆకారం కలిగిన చిన్న చిన్న దోశలను పోసుకోవాల్సి ఉంటుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఇలా పోసుకున్న తర్వాత దోషను చిన్న మంటపై ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానిపై కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసి అంచుల వెంట నూనె లేదా నెయ్యిని వేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ఫ్లేమ్‌లోనే దోశను నెమ్మదిగా కాల్చుకుంటూ.. ఒక నిమిషం తర్వాత ముందు వైపు కూడా కాల్ చాల్సి ఉంటుంది. ఇలా రెండు నిమిషాల పాటు అటు ఇటు కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Set Dosa Recipe: దోశ తిని తిని బోర్ కొడుతున్న వారికోసం..స్పాంజ్ సెట్ దోశ రెసిపీ..