Honey For Weight Loss: ఒక్క సారి ఊబకాయం సమస్యతో బాధపడితే అది రక్తంలో చక్కెర, థైరాయిడ్, బిపి, చర్మపు దద్దుర్లు మొదలైన సమస్యలను తెచ్చి పెట్టే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందుకే చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బరువు పెరగడానికి ప్రధాన కారణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందడం లేదు. అయితే శరీర కొవ్వును తగ్గించుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించండి.
ఆహారాల్లో తేనెను తీసుకుంటే బరువు తగ్గుతారా..?:
>> శరీర బరువు తగ్గడానికి ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది.
>>తేనెలో విటమిన్ B-6, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, రిబోఫ్లావిన్, నియాసిన్ వంటి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో వినియోగిస్తే సులభంగా శరీర బరువు తగ్గి అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
>>ముఖ్యంగా తేనెలో ఉండే పోషకాలు జీవక్రియ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా తేనెను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
>>గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగిన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలు సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మీరు తేనెను గ్రీన్ టీలో కూడా తాగొచ్చు.
>>గోరువెచ్చని నీళ్లతో తేనెను కలిపి తాగడం వల్ల ఉదయాన్నే మల విసర్జన సులభతరమవుతుంది. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ దీనిని తాగాల్సి ఉంటుంది.
Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స్
Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook