Stomach Problems: పొట్టనొప్పి, లూజ్ మోషన్స్‌, సమస్యలేవైనా రూపాయి ఖర్చు లేకుండా చెక్ పెట్టొచ్చు..

Home Remedies For Stomach Problems: చలికాలంలో చాలామంది తీవ్ర పొట్ట సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిన్న చిన్న చిట్కాలను వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 09:42 PM IST
Stomach Problems: పొట్టనొప్పి, లూజ్ మోషన్స్‌, సమస్యలేవైనా రూపాయి ఖర్చు లేకుండా చెక్ పెట్టొచ్చు..

 

Home Remedies For Stomach Problems: వాతావరణంలో తేమ పెరగడం తగ్గడం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల ప్రభావం పెరిగి చాలామంది పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమయంలో చాలామందిలో కడుపునొప్పి, లూజ్ మోషన్ ఇతర పొట్ట సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బలురకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం కూడా మానుకోవాలి. శీతాకాలంలో చాలామంది పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

అంతేకాకుండా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఔషధాలను వినియోగిస్తున్నారు. అయితే వీటికి బదులుగా ఎలాంటి ఖర్చులు లేకుండా సులభంగా ఇంటి చిట్కాల ద్వారా కూడా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే చిట్కాలను పాటించడం వల్ల సులభంగా పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రెమెడీస్‌తో సులభంగా పొట్ట సమస్యలకు చెక్ పెట్టవచ్చు:
సోంపు నీరు:

ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సోంపును నీటిలో మరిగించి గోరువెచ్చగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అన్ని రకాల పొట్ట సంబంధిత సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో ఈ వాటర్ ని తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు.

ఫైబర్ అధిక మోతాదులో ఉండే ఆహారాలు తీసుకోవాలి:
శీతాకాలంలో మలబద్ధకం, లూజ్ మోషన్స్, పొట్టనొప్పి ఇతర పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఫైబర్ అధిక పరిమాణంలో లభించే ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. చలికాలంలో ప్రతిరోజు గింజలు, బ్రోకలీ, బీన్స్, తృణధాన్యాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా శరీర బరువును కూడా సులభంగా నియంత్రించుకోవచ్చు.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ఔషధ గుణాలు కలిగిన టీలను తప్పకుండా తీసుకోండి:
చలికాలంలో తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు జీలకర్ర, పుదీనా, దాల్చినచెక్క, గ్రీన్ టీ, చమోమిలే టీలను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా పొట్టలోని జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయని వారంటున్నారు. కాబట్టి తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ టీలను తప్పకుండా తీసుకోండి.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News