Heart Attack Prevention: భారత్‌లో రోజురోజుకు గుండెపోటు సమస్య బారిన పడే సంఖ్య రోజుకు పెరిగిపోతోంది. ప్రతి వంద మందిలో 25 మంది గుండె గుండెపోటుకు గురవుతుంటే పదిమంది మరణిస్తున్నారని ఇటీవలే పని నివేదికలు పేర్కొన్నాయి. పునీత్ రాజ్ కుమార్ వంటి సెలబ్రిటీలు కూడా జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలికి అలవాటు పడడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు వల్ల ఏటా మరణించే వారి సంఖ్య:
నివేదికల ప్రకారం భారతదేశంలో ప్రతి లక్ష మందిలో 20072 మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అంతేకాకుండా భారత్ లో ఏటా 13 నుంచి 14 లక్షల మంది గుండెపోటు సమస్యలకు గురవుతున్నారని ఇటీవలే నివేదికలు వెల్లడించాయి. వీరిలో 8 శాతం మంది 30 రోజుల్లోనే గుండెపోటుతో మరణిస్తుంటే మరికొంతమంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
గుండెపోటుతో మరణించడానికి కారణాలు ఇవేనా..?:
సిగరెట్ మానుకోవడం:
ధూమపానం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులు గుండెపోటు సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఇదే. కాబట్టి తప్పకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సిగరెట్ మానేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ధూమపానం మానుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తప్పించవచ్చు.
ధూమపానం పై పరిశోధనలు ఏం చెబుతున్నాయి?:
న్యూయార్క్‌లోని ప్రెస్బిటేరియన్ హాస్పిటల్ మరియు వెయిల్ కార్నెల్ మెడికల్ కాలేజీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ కార్డియోవాస్కులర్ ఇమేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ జె. మిన్, ధూమపానం (స్మోకింగ్) గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి గుండె జబ్బులతో బాధపడుతున్న వారు తప్పకుండా ధూమపానం మానుకోవాలని సూచిస్తున్నారు. ధూమపానం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు రావడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ధూమపానాన్ని మానుకోవాల్సి ఉంటుంది లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Ind Vs Ban: బంగ్లాతో వన్డేకు ఓపెనర్‌గా ధావన్ ప్లేస్‌లో విధ్వంసకర ఆటగాడు.. రోహిత్ శర్మ ప్లాన్ అదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి