Health Tips: బాడీలో ఎనర్జీ తగ్గడానికి కారణాలు ఇవే.. వీటి జోలికి అస్సలు వెళ్లకండి..!

Health Tips: వేసవి కాలంలో మనం మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో శరీరంలో శక్తి తగ్గిపోయే అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఎండకాలంలో ఏది తిన్నా అది నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2022, 10:51 AM IST
  • బాడీలో ఎనర్జీ తగ్గుతుందా..
  • చక్కెర అధికంగా ఉండే ఆహారం తినకండి
  • ఫాస్ట్ ఫుడ్‌ను ఆహారంగా తిసుకోకండి
Health Tips: బాడీలో ఎనర్జీ తగ్గడానికి కారణాలు ఇవే.. వీటి జోలికి అస్సలు వెళ్లకండి..!

Health Tips: వేసవి కాలంలో మనం మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో శరీరంలో శక్తి తగ్గిపోయే అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఎండకాలంలో ఏది తిన్నా అది నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎండకాలంలో కొంత మంది తినకూడని ఆహారాన్ని కూడా తినడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్‌ తగ్గుతూ వస్తున్నాయి. ఏ వస్తువులను ఎక్కువగా తింటే శరీరంలో శక్తి తగ్గుతుందో తెలుసుకుందాం..

వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది:

చక్కెర అధికంగా ఉండే ఆహారం:

చాలా మంది ఎండకాలంలో మార్కెట్‌లో అందుబాటులో ఉండే చక్కెర పదార్థాలను అధికంగా తింటున్నారు. వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోయే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాఫీ:

సాధారణంగా ప్రజలు అలసిపోయినప్పుడు కాఫీని తీసుకుంటారు. కాఫీలో కెఫీన్ ఉండటం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుంది. కావున ఇది శరీర శక్తిని తగ్గించేందుకు దోహదపడుతుంది.

ఫాస్ట్ ఫుడ్:

తరచుగా ప్రజలు ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వీటిని అధికంగా తినడం వల్ల శరీరంలో శక్తిని పెంచే పోషకాలు తగ్గిపోతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: High Protein Sweets: ఈ ఐదు రకాల స్వీట్లతో శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Also Read: Heart Attack: గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే.. ఈ పండ్లను తీసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

 

Trending News