Belly Fat tips: రోజూ ఈ రెండు వ్యాయామాలు చేస్తే చాలు, నెలలో బెల్లీ ఫ్యాట్ మాయం

Belly Fat tips: ఆధునిక జీవనశైలిలో బెల్లీ ఫ్యాట్, స్థూలకాయం ప్రధాన సమస్యగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలనుకుంటుంటారు. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలమౌతుంటారు. అయితే కొన్ని సులభమైన టిప్స్ పాటించి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2023, 05:23 PM IST
Belly Fat tips: రోజూ ఈ రెండు వ్యాయామాలు చేస్తే చాలు, నెలలో బెల్లీ ఫ్యాట్ మాయం

Belly Fat tips: ఆరోగ్యంగా ఉండాలని, స్లిమ్ అండ్ ఫిడ్ బాడీ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి ఆశ. వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే స్థూలకాయం అందరికీ ఓ సమస్యగా మారిపోయింది. మరోవైపు బెల్లీ ఫ్యాట్ కారణంగా నలుగురిలో అవమానకరంగా భావిస్తుంటారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించడం..

స్థూలకాయం లేదా అధిక బరువు అనేది ప్రతి ఒక్కరిని బాధించే సమస్య. శరీరంలోని వివిధ భాగాల్లో పేరుకుపోయే కొవ్వును తొలగించేందుకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. మీక్కూడా బెల్లీ ఫ్యాట్ సమస్యగా ఉంటే..ఇంట్లోనే కొన్ని రకాల వ్యాయామాలు చేసి ఉపశమనం పొందవచ్చు. బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలి, ఎలాంటి వ్యాయామం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బెల్లీ ఫ్యాట్ అనేది ఇటీవలి కాలంలో చాలామందిలో సర్వ సాధారణంగా కన్పించే సమస్య. సాధారణంగా పొట్ట చుట్టూ లేదా నడము చుట్టూ కొవ్వు పేరుకుపోయి కన్పిస్తుంటుంది. ఈ ఫ్యాట్ తొలగించేందుకు రోజూ క్రమం తప్పకుండా బర్ఫీ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. బర్ఫీ వ్యాయామ అనేది మీ భుజాల్ని బలోపేతం చేస్తుంది. దాంతోపాటు బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ముందు నిటారుగా నిలుచుని..మోకాళ్లు ముడవాలి. రెండు చేతులూ కిందకు ఆన్చాలి. ఇప్పుడు కాళ్లను వెనక్కి తీసుకెళ్లాలి. ఆ తరువాత కాళ్లను తిరిగి చేతుల వరకూ తీసుకురావాలి. చివరిగా ఎగురుతూ నిలబడాలి. ఇలా రోజుకు 10 సార్లు చేయాలి.

రోజూ బేస్ బాల్ వ్యాయామం చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది సులభంగా తగ్గిపోతుంది. ఈ వ్యాయామం చేసేందుకు బేస్ బాల్ అవసరమౌతుంది. బేస్ బాల్‌ను నేలపై ఉంచి కాళ్లను నిటారుగా చేసి చేతుల్ని బేస్ బాల్ చివర్లలో ఉంచాలి. ఈ స్థితిలో మీ కాలి వేళ్లు భూమిపైనే ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది.

Also read: Joint Pain Relief: కీళ్ల నొప్పులను తగ్గించే అద్భుత గుణాలు కలిగిన నూనె ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News