Running Tips: శారీరక శ్రమ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకే చాలా మంది వాకింగ్ లేదా రన్నింగ్ లేదా జిమ్ వర్కవుట్స్ చేస్తుంటారు. ఇది అవసరం కూడా. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే వాకింగ్ లేదా రన్నింగ్ చేయాల్సిందే. కానీ అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
రోజూ క్రమం తప్పకుండా నియమిత పద్ధతిలో రన్నింగ్ చేయడం మంచి అలవాటు. దీనివల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అంతేకాకుండా శరీరం ఫిట్‌గా ఉంటుంది. అందుకే చాలామంది ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయకుండా కేవలం రన్నింగ్‌పై ఆధారపడుతుంటారు. నిజంగానే రన్నింగ్ అంత మంచిది. కానీ మొదటి సారి రన్నింగ్ చేస్తుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే సమస్య ఎదురుకావచ్చు. శరీరాన్ని పూర్తిగా ఫిట్‌గా ఉంచాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. నియమిత సమయంలో ఎక్సర్‌సైజ్ లేదా రన్నింగ్‌తో పాటు కావల్సినంత నిద్ర కూడా అవసరం. ఇలా చేయడం వల్ల శరీరం పూర్తిగా ఫిట్‌గా ఉంటుంది.
ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రతి రోజూ వ్యాయామానికి తగిన సమయం తీయడం కష్టమౌతుంటుంది. అందుకే చాలామంది వ్యాయామం వదిలేసి కేవలం రన్నింగ్ చేస్తుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంటారు. రోజూ రన్నింగ్ చేయడం వల్ల చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. మరోవైపు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఊపిరితిత్తులు స్ట్రాంగ్‌గా మారతాయి. మొదటిసారి రన్నింగ్ చేసేవాళ్లు మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇవి పాటించకపోతే సమస్యలు ఎదురుకావచ్చు.
రన్నింగ్ చేసేటప్పుడు మీరు ధరించే షూ ఫిట్‌గా, సౌకర్యవంతంగా ఉండేట్టు చూసుకోవాలి. షూ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే రన్నింగ్‌లో సమస్య రావచ్చు. ఇది కాస్తా కాళ్ల నొప్పులకు దారితీస్తుంది. అందుకే షూ అనేది సరైన సైజ్‌లో ఉండాలి. ఎక్కువ టైట్ లేదా ఎక్కువ లూజ్ ఉండకూడదు.
రన్నింగ్ చేసేటప్పుడు పోశ్చర్ సరిగ్గా ఉండాలి. పరుగెట్టేటప్పుడు మీ శరీరాన్ని నిటారుగానే ఉంచాలి. విల్లులా వంచకూడదు. మీ చేయి నడుముకు సమానంగా ఉండాలి. పరుగెట్టేటప్పుడు శరీరాన్ని వంచకూడదు.
అన్నింటికంటే ముఖ్యమైంది ఇది. రన్నింగ్ సమయంలో వేగం మంచిది కాదు. ప్రారంభంలో కొన్ని రోజుల వరకూ వేగంగా పరుగెత్తడం చేయకూడదు. ఇలా చేస్తే త్వరగా అలసిపోయి..ఎక్కువ సేపు రన్నింగ్ చేయలేరు. అందుకే నార్మల్ రన్నింగ్ మంచిది.
Also read: Intermittent Fasting: ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి, ఎలా చేస్తారు, లాభాలు, దుష్పరిణామాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook