Health Risk: బరువు పెరిగితే గుండె పోటు సమస్యలు వస్తాయా..?

Health Risk Related To Obesity: ప్రస్తుతం చాలామంది ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు తలెత్తడం వల్ల ఊబకాయం, బరువు పెరగడం, గుండెపోటు వంటి సమస్యలు బారిన పడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2022, 05:08 PM IST
  • బరువు పెరిగితే గుండె పోటు.
  • మధుమేహం, అధిక రక్త పోటు..
  • సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Health Risk: బరువు పెరిగితే గుండె పోటు సమస్యలు వస్తాయా..?

Health Risk Related To Obesity: ప్రస్తుతం చాలామంది ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు తలెత్తడం వల్ల ఊబకాయం, బరువు పెరగడం, గుండెపోటు వంటి సమస్యలు బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కచ్చితంగా కొన్ని నియమాలతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఈ సమస్యలు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. అంతేకాకుండా ఊబకాయం వల్ల ఇంకొన్ని రకాల ప్రాణాంతకమైన వ్యాధులు కూడా రావచ్చు. ఆ వ్యాధులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..

ఈ సమస్యలు తప్పవు:

గుండెపోటు సమస్యలు:
ఊబకాయం సమస్యలు తీవ్రతరమైతే గుండెపోటు వంటి సమస్యలు ఉత్పన్నమయ్య అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గుండెకు రక్త సరఫరా చేసే ధమనులలో కొవ్వు నిల్వలు పేరుకుపోయి అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి ముందుగానే ఊబకాయాన్ని గుర్తించి దీని నుంచి ఉపశమనం పొందడం చాలా మందిని నిపుణులు చెబుతున్నారు.

గుండెలో వివిధ సమస్యలు:
ఊబకాయం ఉన్న చాలామందిలో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు అధికం. కాబట్టి తప్పకుండా ఈ సమస్యపై శ్రద్ధ వహించి దీని నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొందరిలో దీనికి కారణం వల్ల శరీర బలహీనత సమస్యలు కూడా వస్తున్నాయి.

అధిక రక్తపోటు:
అధిక బరువు కూడా అధిక రక్తపోటు సమస్యతో ముడిపడి ఉంటుంది. శరీరంలో ఉండే కొవ్వు కణజాలాలకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అవసరమవుతాయి. దీని కారణంగా మీ రక్తనాళాలు అదనపు కొవ్వు కణజాలాలలో అదనపు రక్త ప్రవాహం కలుగుతుంది. దీని వల్ల కొందరిలో ప్రాణాపాయ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News