Hair care: పొడవైన జుట్టు ఉన్న వారిని చూస్తే.. ఎవరైనా వెనక్కి తిరిగి చూడాల్సిందే. ఆడవాళ్ళకి జుట్టు ఎంత ఉన్నా ఇంకా కాస్త పొడుగు ఉంటే బాగుండు.. మరి కాస్త ఒత్తుగా ఉంటే ఇంకా బాగుండు అని అనిపిస్తూనే ఉంటుంది. జుట్టు ఎంత అందంగా ఉంటే.. ముఖం అంతా కాంతితో మెరిసిపోతుంది మరి. అయితే ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి కారణంగా పొడువాటి జుట్టు మెయింటైన్ చేయడం ఎంతో కష్టంగా మారుతోంది. దానికంటే కష్టం హెయిర్ ఫాల్ ఆపడం. మరి ఇంటి వద్దనే సులభంగా దొరికే ఒక రెండు వస్తువులను ఉపయోగిస్తే.. మీ జుట్టు రాలడం ఆగి ఎంతో ఆరోగ్యకరంగా మారుతుంది అని మీకు తెలుసా? మరింకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటి ఒకసారి చూద్దాం రండి.
అనాదిగా ఆయుర్వేదంలో మందార పువ్వును జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలకు మందుగా వాడుతూ వచ్చారు. అలాగే తలకు ఎక్కువగా కుంకుడుకాయ లేదా శీకాకాయిని షాంపూ బదులు వాడేవారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో సులభంగా దొరికే పలు రకాల షాంపులు వాడడానికి మనం అలవాటు పడిపోయాం. అందుకే మనకు అమ్మమ్మల నాటి హెయిర్ కేర్ పద్ధతులు మోటుగా కనిపిస్తాయి. అయితే మనకు తెలియని రహస్యం ఏమిటంటే ఇవే మనకు బెస్ట్.
ఎంతటి కాలుష్యం లో అయినా జుట్టును మృదువుగా ఉంచుతూ ఎటువంటి హెయిర్ ఫాల్ లేకుండా చేయగలిగే దివ్య ఔషధాలలో మందార పువ్వు ఒకటి. మందార పువ్వులే కాదు మందార ఆకులలో కూడా జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో రసాయనాలు మెండుగా లభిస్తాయి. ప్రస్తుతం చిన్న పిల్లలలో కూడా కనిపించే గ్రే-హెయిర్ సమస్యకు మందారం చక్కటి పరిష్కారం. ఇది నేచురల్ హెయిర్ కండిషనర్ కూడా. ఇంకా చుండ్రు వంటి.. స్కాల్ప్ సంబంధిత ఇన్ఫెక్షన్స్ను దూరంగా పెడుతుంది.
ఇక రోజు మనం వాడే కొబ్బరినూనెలో కేవలం ఈ రెండు వస్తువులు కలపడం వల్ల జుట్టు ఎంతో మృదువుగా మారుతుంది. పైగా ఇలా తయారు చేసే నూనెలో విటమిన్ ఏ, ఫాస్పరస్, రైబోఫ్లావిన్, కాల్షియం తో పాటుగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి జుట్టు మృదువుగా మారుతుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.
తయారీ విధానం
పావు కప్పు కొబ్బరి నూనెకు పావు కప్పు బాదం నూనెను కలపాలి. మందపాటి గిన్నెను స్టవ్ పై పెట్టి ఇందులో ఈ నూనె మిశ్రమాన్ని వేయాలి. ఇప్పుడు ఇందులో తాజా మందార ఆకులు అరకప్పు.. మందార పువ్వులు వేసి సన్నని మంటపై బాగా మరిగించాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు ,కాస్త మెంతులు కూడా చల్లారిన తర్వాత ఈ నూనెను వడకట్టి గాజు సీసాలో భద్రపరచుకొని రోజు వాడుకుంటే సరిపోతుంది. మీ జుత్తు రాలకుండా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది.
గమనిక :పైన అందించిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది.కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Read More: Rajasthan Man Collapses: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా ఊహించని ఘటన.. వీడియో వైరల్..
Read MOre: Viral video: రా రా రక్కమ్మ.. పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వీడియో చూస్తే ఆపుకోలేరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Long Hair: బలమైన,ఒత్తైన జుట్టు కోసం.. ఈ ఒక్క పువ్వు వాడితే చాలు