Kissing Health Benefits: ముద్దుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ముద్దు మంచిదే..

Kissing Health Benefits: ముద్దు.. ముద్దు గురించి చెప్పుకుంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే మాట ముద్దంటే ఎవరికి చేదు అనే కదా... అవును మరి ముద్దంటే ఎవరికీ చేదు చెప్పండి. ముద్దుకు ఉన్న మహత్యం అది. అయితే, చాలామందిని ముద్దును శృంగారంలో, రొమాన్స్‌లో ఒక భాగంగానే చూస్తారు కానీ ముద్దుతోనూ పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం చాలామందికి తెలియదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2023, 06:45 PM IST
Kissing Health Benefits: ముద్దుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ముద్దు మంచిదే..

Kissing Health Benefits: ముద్దు.. ముద్దు గురించి చెప్పుకుంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే మాట ముద్దంటే ఎవరికి చేదు అనే కదా... అవును మరి ముద్దంటే ఎవరికీ చేదు చెప్పండి. ముద్దుకు ఉన్న మహత్యం అది. అయితే, చాలామందిని ముద్దును శృంగారంలో, రొమాన్స్‌లో ఒక భాగంగానే చూస్తారు కానీ ముద్దుతోనూ పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఏంటీ.. సుఖమయమైన జీవితానికి ముద్దూముచ్చట్లు అవసరం అనే తెలుసు కానీ ముద్దుతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అని అవాక్కవుతున్నారా ? అవును.. మీరు చదివింది నిజమే. ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో జరిగే రసాయనిక మార్పులతో ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
 
బీపీని తగ్గించే ముద్దు
బీపీని తగ్గించే ముద్దు అని చదవగానే ముద్దులో కూడా బీపీని తగ్గించే ముద్దు, డయాబెటిస్ ని తగ్గించే ముద్దు అని రకరకాల ముద్దులు ఉంటాయా అని అపార్థం చేసుకోకండి. ఇక్కడ చెప్పదల్చుకున్నది ఏంటంటే.. ముద్దు పెట్టుకోవడం వల్ల బీపీ తగ్గి నార్మల్ అవుతుంది అని. ముద్దు పెట్టుకునే క్రమంలో మనిషి శరీరంలో రక్తనాళాలు వెడల్పుగా తయారవుతాయి. దీంతో రక్త ప్రసరణ సులువు అవుతుంది.

నొప్పి నివారిణి
ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మనిషికి అలసటను దూరం చేసి హాయిని ఇవ్వడమే కాకుండా నొప్పి నివారిణిగానూ పనిచేస్తాయట. అంతేకాకుండా రక్త ప్రసరణ నార్మల్ అవడం వల్ల శరీరంలో తిమ్మిర్లు, తలనొప్పి వంటి సమస్యలు నుంచి కూడా రిలాక్సేషన్ పొందవచ్చు.

పుప్పి పళ్లు రాకుండా చేసే ముద్దు
మీరు మీ పార్ట్‌నర్‌ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీ నోట్లో లాలాజలం విడుదల అవుతుంది. అలా విడుదలయ్యే లాలాజలం దంతాల మధ్య పేరుకుపోయిన పాచిని తొలగించి పుప్పి పళ్లు రాకుండా చేస్తుందట.

హ్యాపీ హార్మోన్స్ విడుదల
ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్, ఆక్సీటోసిన్ అనే హ్యాపీ హార్మోన్స్‌ని విడుదల చేస్తాయి. ఇవి మనిషిని సంతోషంగా ఉంచడానికి సహాయం చేస్తాయి. 

ముద్దు పెట్టుకునేటప్పుడు పెరిగే హార్ట్ రేట్, మజిల్ యాక్టివిటీ వల్ల ఒంట్లో కొన్ని కేలరీలు ఖర్చు అవుతాయి. ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే.

ముద్దుతో పెరిగే ఆత్మవిశ్వాసం
ముద్దు పెట్టుకునే క్రమంలో కలిగే చనువుతో ఇద్దరి మధ్య బంధం మరింత ధృడపడుతుంది. ఇది మీ పట్ల, మీ బంధం పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

ఇది కూడా చదవండి : Benefits of drumsticks: మునగకాయతో నమ్మలేని ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు..!

ముద్దు పెట్టుకోవాలంటే ముఖంలో ఉండే పలు కండరాలు అన్నీ కదలికలకు గురవుతాయి. ఇంకా చెప్పాలంటే ముఖంలోని కండరాల సమన్వయంతోనే ముద్దు పెట్టుకోవడం సాధ్యపడుతుంది. అంటే ముద్దుతో మీ ముఖంలోని కండరాలకు చిన్నపాటి వ్యాయమం అవుతుందన్నమాట. కాదంటారా.. ఒకసారి మీరూ ప్రాక్టికల్‌గా ట్రై చేసి చూడండి. మీ ముఖంలో కండరాలు ముందుకు కదిలిరావడాన్ని స్పష్టంగా ఫీలవుతారు.

ఇది కూడా చదవండి : Best Veg Foods: ఈ కూరగాయల్ని రాత్రి పూట మార్చి మార్చి తింటే, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ అన్నీ మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News