Skin Care Tips: వయస్సు 30 ఏళ్లు దాటినా అందంగా, ఫిట్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Skin Care Tips: ప్రతి మహిళ అందంగా ఉండాలనుకుంటుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా గ్లామరస్‌గా, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటుంది. 30 ఏళ్లు దాటినా అందంగా నిగనిగలాడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2023, 07:28 PM IST
Skin Care Tips: వయస్సు 30 ఏళ్లు దాటినా అందంగా, ఫిట్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

ప్రతి వయస్సులోనూ అంటే వయస్సు మీదపడినా అమ్మాయిలకు అందంపై శ్రద్ధ తగ్గదు. ఎప్పుడూ అందంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలని కోరుకుంటారు. కొన్ని సులభమైన టిప్స్ పాటిస్తే ఇది సాధ్యమేనంటున్నారు.

ఆరోగ్యం, ఫిట్నెస్ అనేది ఎవరికైనా ముఖ్యమే. వయస్సు మీదపడే కొద్దీ పరిస్థితి మారుతుంటుంది. ఫిట్నెస్ సమస్యగా మారడం, ముఖ వర్ఛస్తు తగ్గడం జరుగుతుంది. మహిళలకు ఇది పెద్ద ఇబ్బందిగా పరిణమిస్తుంది. 30 ఏళ్లు దాటేటప్పటికి చర్మం నిగారింపు కోల్పోతుంటుంది. అయితే కొన్ని సూచనలు పాటిస్తే చర్మంపై నిగారింపుతో పాటు అందాన్ని తీర్చిదిద్దుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

30 ఏళ్ల అనంతరం చర్మం ఆరోగ్యంగా ఎలా ఉంచాలి

నీళ్లు ఎక్కువగా తీసుకోవడం

నీటి కొరత కారణంగా ఏజీయింగ్ సమస్య వెంటాడుతుంది. ఎందుకంటే శరీరం మెటబోలిజం మందగించడంతో చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే సాధ్యమైనంతలో ఎక్కువ నీళ్లు తాగాలి. వయస్సు ప్రభావం పడకుండా ఉండాలంటే ఎక్కువ నీళ్లు తాగాల్సిందే.

వయస్సు పెరిగేకొద్దీ సహజంగానే మజిల్స్ టోన్ కావడం, సామర్ధ్యం తగ్గడం జరుగుతుంది. అందుకే ఫిట్నెస్ కోసం స్ట్రెంత్ ట్రైనింగ్ , కార్డియో వర్కవుట్స్ అవసరమౌతాయి. ఇలా చేయడం వల్ల చర్మం సుదీర్ఘకాలం యౌవనంగా ఉంటుంది.

వర్కవుట్‌లో మార్పు

ఒకటే వ్యాయామం చేయడం వల్ల మీ స్ట్రెంత్ పెరగదు. అందుకే విభిన్న రకాలైన వర్కవుట్స్ చేయాలి. ప్రతి నెలా వర్కవుట్స్ మార్చాల్సి ఉంటుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉంటుంది. 

శరీరంలో  తేమ, తాజాదనం స్థిరంగా ఉంచేందుకు యోగా తప్పకుండా చేయాలి. యోగా చేయడం వల్ల మనశ్సాంతి లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. యోగా ప్రతిరోజూ తప్పనిసరిగా చేయడం వల్ల 30 ఏళ్ల తరువాత కూడా యౌవనంగా ఉంటారు. 

రన్నింగ్ షూస్ మార్చడం

రోజూవారీ పనులు కూడా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా రోజూ మీరు వాడే రన్నింగ్ షూస్ ప్రతి 6 నెలలకోసారి మార్చాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల రన్నింగ్ చేసేటప్పుడు విభిన్న రకాలైన స్ట్రెస్ దూరమౌతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

Also read: Constipation: భోజనంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే.. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం అస్సలు రావు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News