ఫిబ్రవరి నెల రాగానే అందరి మదిలో మెదిలేది ప్రేమ, వాలెంటైన్స్ డే Valentines Day (ప్రేమికుల రోజు). ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ప్రేయసి, ప్రేమికుడు తమ మనసులోని భావాలను చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తుంటారు. వారికి తోచినట్లుగా, స్థాయికి తగినట్లుగా తమ ప్రేయసి/ప్రియుడికి ఏదో ఒక బహుమతి ఇచ్చి మనసులోని మాటను చెబుతారు. ఇలా చెప్పడానే ప్రపోజ్ చేయడం అంటారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో ప్రపోజ్ డే (Propose day) సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే వాలెంటైన్స్ డేతో పాటు వాలెంటైన్స్ వీక్ ఉందని మీకు తెలుసా. వారం రోజుల ముందుగానే ప్రేమికుల సంబరాలు మొదలవుతాయి.
ఫిబ్రవరి 7న ‘రోజ్ డే’(Rose day)తో మొదలుకుని, చాక్లెట్స్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే.. చివరగా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు వరకు వారం రోజులపాటు ప్రేమ పండుగను వారం రోజులు ఆస్వాదించవచ్చు. ఫిబ్రవరి 8వ తేదీన మనసులోని ప్రేమను వ్యక్తం చేసి ప్రపోజ్ డేని ఎంజాయ్ చేయండి. మీకు తోచినట్లుగా ఓ రోజా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయవచ్చు. లవ్ కొటేషన్ ఉన్న మంచి గ్రీటింగ్ కార్డునో, రింగ్, చేతి వాచ్, ఇంట్లో నిత్యం వాడుకునే ఇష్టపడే వస్తువును గిఫ్ట్‌గా ఇస్తూ ఐ లవ్ యూ చెప్పేయండి. ప్రేమ తెలపకపోతే అవతలివారికి మీ మీద ఫీలింగ్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది. లేక మీకు వారంటే ఇష్టం లేదని వారు అడ్వాన్స్ అవ్వకపోయే అవకాశం లేకపోలేదు.
పెన్ను కదపడం మీకు అలవాటున్న వారైతే సొంతంగా ప్రేమను తెలుపుతూ లవ్ లెటర్ రాయడం బెటర్. సంగీతవాద్యాలపై పట్టుంటే వాటిని ప్లే చేస్తూ మంచి సమయం చూసి ప్రేమ విషయాన్ని చెబితే ప్రయోజనం ఉండవచ్చు. అబ్బాయిలైతే ఓ ఎర్రటి రోజా పువ్వుతో పాటు లవ్ లెటర్ ఇవ్వండి. ప్రేమ రిజెక్ట్ చేశారని కుంటిపోవాల్సిన అవసరం లేదని మనోతత్వవేత్తలు చెబుతారు. మీ వరకు ప్రయత్నం చేశారని, లేకపోతే అయ్యో నా ప్రేమను వ్యక్తం చేయలేకపోయానని జీవితాంతం నరకం అనుభవిస్తున్న వాళ్లు సైతం మీకు తారస పడుతుంటారు.