Hair Fall Problem: ఆధునిక జీవనశైలి ప్రభావం ఎక్కువగా కన్పిస్తూ..పెను సమస్యగా మారేది హెయిర్ ఫాల్ విషయంలో. యుక్తవయస్సుకే జుట్టు రాలిపోతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే సులభమైన చిట్కాతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..
వివిధ రకాల ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి, జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే జుట్టు రాలడం అధికంగా కన్పిస్తోంది. ఈ సమస్య ప్రస్తుతం సర్వ సాధారణంగా మారిపోయింది. అబ్బాయిలు, అమ్మాయిల్లో హెయిర్ ఫాల్ సమస్య కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన మానసిక వేదనకు గురౌతున్నారు. ఈ క్రమంలో సులభమైన చిట్కాతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి పొందేందుకు బియ్యం, మెంతులు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ రెండింటినీ కలిపి వాడటం వల్ల జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలు దూరమౌతాయి. బియ్యం, మెంతుల్ని ఎలా వినియోగించాలి, ఏయే ప్రయోజనాలున్నాయో చూద్దాం..
1. జుట్టుకు బియ్యం, మెంతుల మిశ్రమం రాయడం వల్ల ప్రధానంగా డేండ్రఫ్ సమస్య దూరమౌతుంది. మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు డేండ్రఫ్‌ను నిర్మూలిస్తాయి.
2. బియ్యం, మెంతుల మిశ్రమంతో హెయిర్ ఫాల్ అరికట్టవచ్చు. ఈ మిశ్రమం క్రమం తప్పకుండా రాయడం వల్ల కేశాలు పటిష్టమౌతాయి.
3. మీ కేశాల్ని మెరిసేలా చేసేందుకు కూడా బియ్యం, మెంతుల మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమం వల్ల కేశాలకు నిగారింపు వస్తుంది.
4. మెంతులు, బియ్యం మిశ్రమంతో కేశాలు బలంగా ఎదుగుతాయి. కొత్తగా కేశాలు వచ్చేందుకు కూడా ఈ మిశ్రమం దోహదమౌతుంది.
బియ్యం, మెంతుల మిశ్రమం కోసం 2-3 గ్లాసుల నీళ్లను బాగా ఉడికించాలి. ఇప్పుడు 2-3 స్పూన్ల మెంతులు, బియ్యం వేసి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన తరువాత తలకు బాగా పట్టించి అరగంట ఉంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి.
Also read: Ginger Benefits: రోజూ పరగడుపున అల్లం రసం తాగితే..నాలుగు వారాల్లోనే జీరో వెయిట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook