Foods To Raise Good Cholesterol: ప్రస్తుతకాలంలో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. శరీరంలో అధిక చెడు కొలెస్ట్రాల్ ఉండటం వల్ల గుండె పోటు వచ్చ అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే చెడు కొలెస్ట్రాల్ కి బదులుగా మంచి కొలెస్ట్రాల్‌ను అందించే ఆహారపదార్థాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అసలు మంచి కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? ఇది ఎక్కడ దొరుకుతుంది? అనేది మనం తెలుసుకుందాం.
మంచి కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో సహజంగా ఉండే ఒక పదార్థం. ఇది హార్మోన్ ఉత్పత్తికి ఎంతో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ అనేది రెండు విధాలుగా ఉంటాయి. మొదటిది మంచి కొలెస్ట్రాల్ దీనిని హై డెన్సిటీ లిపోప్రొటీన్ అని కూడా అంటారు. ఇది రక్తనాళాల నుంచి అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో మేలు చేస్తుంది. చివరిది చెడు కొలెస్ట్రాల్ దీని హై డెన్సిటీ లిపోప్రొటీన్ అని కూడా పిలుస్తారు. ఇది రక్తనాళాల గోడలపై పేరుకుపోతుందిన దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మంచి కొలెస్ట్రాల్ ను పెరిగే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎందుకు మంచి కొలెస్ట్రాల్ మంచిది?
మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాలలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటాము. ఇది గుండె పోటు, స్ట్రోక్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి గుండె కు మంచి కొలెస్ట్రాల్ తీసుకోవడం చాలా అవసరం.
అయితే మంచి కొలెస్ట్రాల్ లభించే ఆహారపదార్ధాలు గురించి మనం తెలుసుకుందాం వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మంచి కొలెస్ట్రాల్‌ను అందించడంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు, గింజలు ఎక్కువగా సహాయపడుతాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్‌లో లేదా ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది. అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. అలాగే రక్త ప్రసవం సరిగా అవుతుంది. అధిక బరువు ఉన్నవారు వాకింగ్, యోగా చేయడం ముఖ్యం. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను పెరగాలంటే ధూమపానం, మద్య పానం తీసుకోవడం మానుకోవాలి.అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తరచూ పరీక్షించుకోవడం, వైద్యుని సలహా మేరకు చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: Diabetes: డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే ఈ ఆసనాలు ట్రై చేయాల్సిందే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.