Ginger Powder Face Mask Benefits: అల్లం లో ఎన్నో రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా సీజన్లో వచ్చే జబ్బుల నుంచి శరీరాన్ని కాపాడేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. వాతావరణం లో తేమ పెరగడం కారణంగా ప్రస్తుతం చాలామంది దగ్గు జలుబు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి వారికి కూడా అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అల్లం లో ఉండే గుణాలు జలుబు దగ్గును సులభంగా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి తీవ్రవ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. అల్లంతో చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని కాంతివంతంగా తీర్చిదిద్దేందుకు సహాయపడతాయి. కాబట్టి అల్లాన్ని పేస్టులా తయారు చేసి ముఖానికి కూడా అప్లై చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లాన్ని ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలి:
>>మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలనుకుంటే అల్లం రసంలో రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ వేసి, అందులోనే ఒక రెండు టీ స్పూన్ల తేనెను కలిపి ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీరు త్వరలోనే ఫలితం పొందవచ్చు.
>>అల్లం పేస్టును ముఖానికి రాసుకోవడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ అల్లం పేస్ట్ ను క్రమం తప్పకుండా ముఖానికి రాసుకుంటే ముఖంపై ముడతలు సులభంగా తగ్గిపోతాయి అంతేకాకుండా ముఖంపై ఉన్న టానింగ్ కూడా సులభంగా తొలగిపోతుంది.
>>అల్లం మాస్క్ ని క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేస్తే.. చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. కాకుండా ముఖంపై ఉండే చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కాబట్టి తరచుగా చర్మ సమస్యలకు గురవుతున్న వారు తప్పకుండా తప్పకుండా ఈ అల్లం మాస్కులు వినియోగించండి.
Also Read: Rohit Sharma: రోహిత్ భయ్యా.. నీకు కుట్లు పడిన విషయం గుర్తుందా! నువ్ 'మగధీర'లో హీరో
Also Read: Delhi MCD Election Result: ఢిల్లీ కార్పొరేషన్ పీఠం ఆప్ కైవసం.. బీజేపీ చేసిన తప్పులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి