Diabetes And Cholesterol: రక్తపోటు, కొలెస్ట్రాల్‌, మధుమేహానికి ఇలా మునగతో 15 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Get Rid Diabetes And Cholesterol: మునగలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటి ఆకులను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 07:02 PM IST
  • మునగను ఆహారంలో తీసుకుంటే
  • రక్తపోటు, కొలెస్ట్రాల్‌, మధుమేహం..
  • సమస్యలు కేవలం 15 రోజుల్లో తగ్గుతాయి
Diabetes And Cholesterol: రక్తపోటు, కొలెస్ట్రాల్‌, మధుమేహానికి ఇలా మునగతో 15 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Drumstick For Diabetes And Cholesterol Free: మునగ చేసిన మేలు తల్లి కూడా చేయ్యదని ఒక సామెత ఉంటుంది. అవును ఇది నిజం మునగలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. మునగను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలడం, రక్తహీనత, కీళ్లనొప్పులు, థైరాయిడ్, ఉబ్బసం, బలహీనమైన రోగనిరోధక శక్తి, మధుమేహం వంటి సమస్యలో పాటు బరువు కూడా సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని బెరడును వ్యాధుల చికిత్సలో కూడా వినియోగిస్తారు. అయితే వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

మునగ మొక్క లో విటమిన్ ఎ, విటమిన్ బి1 (థియామిన్), బి2 (రిబోఫ్లావిన్), బి3 (నియాసిన్), బి-6, ఫోలేట్, ఆస్కార్బిక్ యాసిడ్ (విటమిన్ సి), కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ అధిక పరిమాణంలో లభిస్తాయి.

మునగ లక్షణాలు:
మునగ మొక్కలో యాంటీబయాటిక్, అనాల్జేసిక్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-డయాబెటిక్, యాంటీ ఫంగల్ లభిస్తాయి. కాబట్టి ఈ మొక్కను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.

మునగ ప్రయోజనాలు:
ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచేందుకు సహాయపడుతుంది.
రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
కాలేయం, మూత్రపిండాలను నిర్విషీకరణ చేస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేసి.. చర్మ వ్యాధులను దూరం చేస్తుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఒత్తిడి, ఆందోళన సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.
థైరాయిడ్‌ను సులభంగా తగ్గించడానికి సహాయపడుతుంది.

మునగను ఎలా ఉపయోగించాలి..?:
మునగను చెట్టు అన్ని భాగాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ దీని ఆకుల వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు చేకూరుతాయి.  ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తాగితే శరీరంలో అన్ని రకాల తీవ్ర వ్యాధులు సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Kalpika Ganesh Pics: కల్పిక గణేష్ హాట్ ఫొటోస్.. తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

Also Read: Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారుడిగా అలీ నియామకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News