Diabetes: మధుమేహం ఉన్నవారు ఈ పండ్ల రసాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Fruit Juice For Diabetes: ప్రస్తుతం చాలా మంది పండ్ల రసాలను విచ్చల విడిగా తాగుతున్నారు. అయితే ఇలా తాగడం శరీరానికి చాలా మంచిదైనా కేవలం కొన్ని సమయాల్లో మాత్రమే తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కింది సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 10:06 AM IST
Diabetes: మధుమేహం ఉన్నవారు ఈ పండ్ల రసాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Fruit Juice For Diabetes: పండ్లను తినడమేకాకుండా జ్యూస్ తయారు చేసుకుని తాగుతారు. ఎందుకంటే పండ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వాటి ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అయితే పండ్ల రసాలను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి శక్తి అందడమేకాకుండా బాడీ దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే పండ్లను రోజులో కొన్ని సమయాల్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని పద్ధత్తుల్లో పండ్లను తీసుకోవడం వల్లే శరీరానికి పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్నవారు పండ్లు తీసుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలా పండ్లను తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గే క్రమంలో ఆహారాలు తీసుకోవడం మానుకుని పండ్ల రసాలను తాగుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు బరువు పెరిగే అవకాశాలున్నాయి.

పండ్ల రసం ఏయే సమయాల్లో తాగొద్దు:
ఉదయం నిద్ర లేసిన వెంటనే:

నిద్రలేచిన వెంటనే పండ్ల రసాన్ని తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మానుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకుంటే ఉదయం లేవగానే మీ పొట్టలో సహజంగా ఆమ్లం తయారవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో  పండ్ల రసాన్ని తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా  ఖాళీ కడుపుతో రసం తాగడం వల్ల మీ ప్యాంక్రియాస్‌పై కూడా చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి ఖాళీ పొట్ట పండ్ల రసాలు తీసుకోవడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొందరిలో కాలేయంపై భారం పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

వ్యాయామాలు చేయడానికి ముందు:
జిమ్‌కి వెళ్లే ముందు చాలా మంది ఫ్రూట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. పండ్ల రసం శరీరానికి చాలా శక్తినిస్తుంది, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి జిమ్‌కి వెళ్లే ముందు జ్యూస్‌లు తాగడం వల్ల కడుపులో తిమ్మిరి, ప్రేగులలో అసౌకర్యం వంటి సమస్యలు కూడా రావొచ్చు. కాబట్టి వ్యాయామాలు చేసిన 30 నిమిషాల తర్వాత పండ్ల రసాలు తాగాల్సి ఉంటుంది.

పడుకునే ముందు:
రాత్రి పడుకునే ముందు  పండ్ల రసాన్ని తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీర బరువు విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రాత్రి పండ్ల రసాలు తాగడం వల్ల ఊబకాయం ప్రమాదాన్ని పెంచే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా కొందరిలో గుండెల్లో మంటలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

మధుమేహం:
మధుమేహంతో బాధపడుతున్నవారు పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. పండ్లలో కూడా అధిక మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి పండ్ల రసాలను ప్రతి రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత వేగం

Also Read: Minister Gummanur Jayaram: మంత్రి గుమ్మనూరు కుటుంబంలో తీవ్ర విషాదం   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News