భారతదేశంలో రూపాయి నోటు ఆవిర్భవించి ఈ రోజుతో వందేళ్లు పూర్తయింది. తొలి రూపాయి నోటు నవంబరు 30, 1917 తేదీన కింగ్ జార్జి 5 చక్రవర్తిగా ఉన్నప్పుడు భారతదేశంలో చెలామణీలోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రారంభం కాకపోవడంతో.. కేవలం గవర్నమెంటు ఆఫ్ ఇండియా పేరు మీదే ఆ నోటు వాడుకలోకి వచ్చింది. ఈ క్రమంలో రూపాయి నోటుకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
"రూపాయి" నోటుకి వందేళ్ళు