Foods For Strong Bones: నేటి రన్ ఆఫ్ ది మిల్ జీవితంలో చాలా మంది ఆరోగ్యంపై దృష్టిపెట్టడం లేదు. వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తింటున్నారు. దీని వల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొంత మందిలో విటమిన్ల లోపం వల్ల ఎముకలు కూడా దృఢత్వాన్ని కోల్పోతున్నాయి. దీంతో చాలా మంది అలసట, బలహీనత వంటి సమస్యలకు లోనవుతున్నారు. ఎముకల సమస్యలు రావడం వల్ల చాలా మందిలో విపరీతమైన నొప్పులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఆహారాలు ప్రతి రోజూ తీసుకుంటే ఎముకలు దృఢంగా మారడం ఖాయం:
బాదం:
రోజూ తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఎముకల సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో శరీరానికి కావాల్సిన కాల్షియం, విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. కాబట్టి వాటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
పాల ఉత్పత్తులు:
పాల ఉత్పత్తుల్లో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని దృఢంగా చేయడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ఇందులో ఉండే గుణాలు ఎముకలను కూడా దృఢంగా చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.ఈ ఉత్పత్తుల్లో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యంగా ఉంచుతాయి.
పైనాపిల్:
పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల కూడా ఎముఖల సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన కాల్షియం అధికంగా లభిస్తుంది. కాబట్టి దీనితో తయారు చేసిన జ్యూస్ ప్రతి రోజూ తాగడం వల్ల ఎముకలకు కాల్షియం లభించి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
సోయాబీన్స్:
సోయాబీన్స్‌ను ఎక్కువగా శాకాహారాలు తింటూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల కూడా ఎముకలకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.
గ్రీన్ లీఫీ వెజిటబుల్స్:
గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా ఎముకలను దృఢంగా చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి అవసరమైన 25 శాతం కాల్షియం లభిస్తుంది. కాబట్టి ఎముకల సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ వీటిని తీసుకోవాడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Prabhas Fans Demand: మాకు అప్డేట్స్ కావాలి సార్.. ట్విట్టర్ ను కదిపేస్తున్న ప్రభాస్ ఫాన్స్!
Also Read: Remove Thaman From SSMB 28: తమన్ ను తీసేయమంటున్న మహేష్ ఫాన్స్.. మీరు పిల్లలురా అంటున్న తమన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.