Fenugreek Seeds Benefits: నిత్యం ఎదురయ్యే అనేక రకాల అనారోగ్య సమస్యలకు సమాధానం మన వంటింట్లోనూ ఉంటుందనే సంగతి చాలామందికి తెలియదు. తెలుసుకుంటే వంటింటి చిట్కాలతోనే అన్నీ దూరం చేసుకోవచ్చు. అందులో ముఖ్యమైంది మెంతులు.
వంటింట్లో లభించే చాలారకాల దినుసుల్లో మెంతులు కీలకమైనవి. మెంతులనేవి కేవలం ఆహార పదార్ధాల్లో రుచి కోసం ఉపయోగించడమే చాలామందికి తెలుసు. కానీ అవే మెంతులతో నిత్యం ఎదురయ్యే చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. ఎందుకంటే మెంతుల్లో ప్రోటీన్లు, విటమిన్ సి, విటమిన్ డి, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, ఫైబర్, సోడియం, ఫాస్పరస్ వంటి చాలా రకాల మూలకాలుంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇవే మెంతుల్ని ప్రతిరోజూ ఖాళీ కడుపున తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. మెంతులు ప్రతిరోజూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
ప్రతిరోజూ పరగడుపున మెంతులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. ఎందుకంటే మెంతుల్లో ఉంటే ఫైబర్ వల్ల మలబద్ధకం, ఎసిడిటీ దూరమౌతుంది. జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి కొన్ని మెంతుల్ని నానబెట్టి..ఉదయాన్నే పరగడుపున ఆ మెంతుల్ని క్రష్ చేసి తినేయాలి. అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం చేయాలంటే..ఇలా తీసుకోవడమే అత్యుత్తమ మార్గం. మెంతుల్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా నివారించవచ్చు. రోజూ మెంతులు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎందుకంటే ఎముకలకు అతి ముఖ్యమైన కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
గుండెపోటు ముప్పు నివారిస్తుంది
ఉదయాన్నే ప్రతిరోజూ మెంతులు తీసుకోవడం వల్ల గుండెకు చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్‌తో పాటు ట్రై గ్లిసరైడ్స్ తగ్గిస్తుంది. ఫలితంగా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. మెంతి నీళ్లను కూడా తీసుకోవచ్చు. ఉదయాన్నే మెంతులు తీసుకోవడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. బరువు సులభంగా తగ్గుతారు. మెంతుల్లో ఉండే పీచు పదార్ధం దీనికి ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతంగా మారేందుకు మెంతులు బాగా ఉపయోగపడతాయి. మెంతుల్లో ఉండే యాంటీ ఏజీయింగ్ గుణాలు ఇందుకు దోహదపడతాయి. చర్మ సంబంధిత వ్యాధులు కూడా దూరమౌతాయి.
Also read: Vitamin D in Pregnant Lady: గర్భంతో ఉన్నప్పుడు విటమిన్ డి లోపం ఉంటే ఏమవుతుంది ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook