Father - Daughter Love: కూతురికి బ్రెయిన్ సర్జరీ.. తండ్రి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Father - Daughter Love: తన కూతురిపై ఉన్న ప్రేమతో ఆ చిన్నారి తండ్రి తన జుట్టుకు కూడా పాప లాగే షేవ్ చేయించుకున్నాడు

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 03:29 PM IST
  • కూతురికి బ్రెయిన్ సర్జరీ
  • తండ్రి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు
  • డాడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాల్సిందే
Father - Daughter Love: కూతురికి బ్రెయిన్ సర్జరీ.. తండ్రి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Father - Daughter Love: ఈ ప్రపంచంలో తండ్రీ కూతుళ్ల అనుబంధం (Father - Daughter Love) చాలా ప్రత్యేకం. ఇంట్లో అమ్మాయి తిరుగుతుంటే.. నాన్న మనసు ఉప్పొంగిపోతుంది. కూతురు వేసే ప్రతి అడుగూ తండ్రికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. హోంవర్క్‌ చేయకుండా టీవీ చూస్తున్నావని అమ్మ తిట్టినా.. దగ్గుతూ ఐస్‌క్రీమ్‌ తింటావా అని తరిమినా.. కూతురుని కాపాడేది నాన్నే. కొడుకులతో సీరియస్‌గా ఉండే నాన్న.. కూతురిని చూడగానే మొత్తం కూల్‌ అయిపోతాడు. ఎందుకంటే కూతురిలో తన అమ్మ, చెల్లి, అక్కను చూసుకుంటాడు నాన్న.

తండ్రీ కూతుళ్ల మధ్య స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధం ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో నిరూపితం అయింది. నిజ జీవితాల్లో కానీ, సినిమాల్లో కానీ తండ్రీ కూతుళ్ల అనుబంధంను మనం చాలాసార్లే చూసుంటాం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ఫొటో తండ్రి మరియు అతని కుమార్తె మధ్య అపురూపమైన బంధాన్ని వర్ణిస్తుంది. కూతురికి బ్రెయిన్ సర్జరీ (Brain Surgery) అనంతరం ఆ తండ్రి చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. 

Also Read: Ravi Shastri-MS Dhoni: సచిన్‌తో సహా ఎందరో ప్లేయర్స్‌ను చూశాను.. కానీ ధోనీ లాంటి ఆటగాడు మాత్రం ఉండడు: రవిశాస్త్రి

ఓ చిన్న పాపకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. తల మధ్య భాగంలో చిన్నారికి చాలా కుట్లు పడ్డాయి. తన కూతురిపై ఉన్న ప్రేమతో ఆ చిన్నారి తండ్రి తన జుట్టుకు కూడా పాప లాగే షేవ్ (Father Shaves Head) చేయించుకున్నాడు. తండ్రి అచ్చు పాపకు వేసిన కుట్ల మాదిరిగానే కటింగ్ చేసుకోవడం విశేషం. ఫొటోలో తండ్రి తన తలను ప్రేమగా కూతురి తలను హత్తుకోవడం చూడొచ్చు. ఈ ఫొటోకు 8000 కంటే ఎక్కువ లైక్‌లు మరియు 1000 కంటే ఎక్కువ రీట్వీట్‌లు వచ్చాయి. 

ఫిగేన్ అనే ట్విట్టర్ యూసర్ ఇందుకు సంబందించిన పోటో (Vairal Photo)లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దాంతో ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఫొటోలు చూసిన తర్వాత ప్రతిఒక్కరు భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమార్తెపై తండ్రికి ఉన్న ప్రేమకు చలించిపోతున్నారు. 'ఒక తండ్రి ప్రేమ మాటల్లో కాకుండా హృదయంతో కూడా చెప్పొచ్చు', 'నిస్వార్థ ప్రేమ', 'తండ్రి ప్రేమను ఇంతకంటే ఎలా చూపిస్తారు', 'డాడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాల్సిందే' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Also Raed: Krunal Pandya Twitter Account: టీమిండియా స్టార్ క్రికెటర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. హ్యాకర్ ఏం డిమాండ్ చేశాడో తెలుసా?!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News