Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ అనేవి ప్రస్తుతం సర్వ సాధారణమైన సమస్యగా మారింది. మరి ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలో సులభమైన చిట్కాల ద్వారా తెలుసుకుందాం..
కంటి కింద నల్లటి వలయాల సమస్య గత కొద్దికాలంగా ఎక్కువైంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. దీనికి కారణం జీవనశైలి. గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్‌తో గడపడం, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటివి ప్రధాన కారణాలు. మేకప్ ద్వారా అమ్మాయిలు ముఖంపై డార్క్ సర్కిల్స్‌ను కొద్దివరకూ దాచుకోగలుగుతున్నారు. కానీ పూర్తిగా నియంత్రించడం సాధ్యం కావడం లేదు. కానీ కొన్ని సులభమైన చిట్కాల ద్వారా డార్క్ సర్కిల్స్ నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. ఆ చిట్కాలు మీ కోసం..
పొటాటో జ్యూస్
బంగాళదుంపలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బంగాళ దుంప రసాన్ని కళ్ల దిగువన రాసుకుంటే..డార్క్ సర్కిల్స్ నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. దీనికోసం బంగాళ దుంపను బాగా తురుమి..రసం తీయాలి. ఈ రసాన్ని కళ్ల దిగువన రాయాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సులభంగా తగ్గుతాయి.
టొమాటో
టొమాటోలో లైకోపీన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరం. కళ్ల దిగువన ఉండే మచ్చలు, డార్క్ సర్కిల్స్ దూరం చేసేందుకు 2 స్పూన్ల టొమాటో రసంలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని..ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాసి పది నిమిషాలుంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి.
కీరా
కీరా అనేది చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముందు కీరాను స్లైసెస్‌గా కోసుకోవాలి. వీటిని అలాగే కళ్ల దిగువ రోజుకు 15 నిమిషాలసేపు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ అద్భుతంగా తగ్గుతాయి.
Also read: Weight Lose Tips: బరువు తగ్గడానికి రోజూ కేవలం ఇలా 20 నిమిషాలు నడవండి చాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook