Drinking Water After Food: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగొచ్చా? నిపుణులు ఏం అంటున్నారో తెలుసా?

Drinking Water After Food: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా చాలా మంది అతిగా నీళ్లు తాగుతుంటారు. కానీ, భోజనం చేసిన తర్వాత చాలా మంది ఎక్కువ నీటిని సేవిస్తారు. అలా భోజనం చేసిన వెంటనే నీరు అధికంగా తాగవచ్చా? నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 01:46 PM IST
Drinking Water After Food: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగొచ్చా? నిపుణులు ఏం అంటున్నారో తెలుసా?

Drinking Water After Food: నీరు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. అందుకే ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. వైద్యుల సూచనల ప్రకారం.. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే నీరు తాగే వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయితే భోజనం చేసిన తర్వాత ఎంతసేపటికి మంచినీళ్లు తాగవచ్చో తెలుసుకుందాం. 

భోజనం తర్వాత ఎప్పుడు నీళ్లు తాగాలి?

ఆహారం జీర్ణం కావడానికి 2 గంటల సమయం పడుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో నీరు త్రాగడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. అందుకే భోజనం చేసిన 45-60 నిమిషాల తర్వాత నీళ్లు తాగాలి. అలాగే తినడానికి అరగంట ముందు నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

సరైన సమయంలో నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

1. ఆహారం తిన్న గంట తర్వాత నీళ్లు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

2. సరైన సమయంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరిగి జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది.

3. పొట్టలో గ్యాస్, ఎసిడిటీ సమస్య ఉండదు.

4. ఆహారంలోని పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది.

5. సరైన సమయంలో నీళ్లు తాగడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది.

తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల కలిగే నష్టాలు.. 

>> ఊబకాయం సమస్య

>> జీర్ణక్రియ సమస్య

>> రక్తంలో చక్కెర స్థాయిని పెంచే సమస్య

>> పొట్టలో గ్యాస్ సమస్యలు రావచ్చు.

(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)    

Also Read: Weight Loss Tips: ఇలా చేస్తే జిమ్ కు వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే బరువు తగ్గొచ్చు!

Also Read: White Hair Solution: తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News